నవతరం

తెలుగు దినపత్రిక

గోప తండాను ప్రత్యేక గ్రామపంచాయతీ గా గుర్తించాలి

జిల్లా కలెక్టర్ కు వినతి

కొత్తగూడెం, జులై 24(నమస్తే ఎల్లంపల్లి): సుజాతనగర్ మండలం సర్వారం గ్రామ పరిధిలోని గోప తండాను ప్రత్యేక గ్రామపంచాయతీగా గుర్తించవలసిందిగా భద్రాద్రి జిల్లా కలెక్టర్ ను గోపాతండాకు చెందిన యువకులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గోప తండాను ఒక గ్రామ పంచాయతీకి కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయని, ఉమ్మడి సర్వారం పంచాయతీలో తాము రాజకీయ, ఉద్యోగ, ఆర్థికపరమైన అనేక అవకాశాలు కోల్పోతున్నామని దాదాపుగా 1200 కు పైగా జనాభా 600కు పైగా ఓట్లు కలిగిన తమ తండాను ప్రత్యేక గ్రామపంచాయతీగా గుర్తించవలసిందిగా కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో జరుపుల కుమార్, మాలోత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading