చిలుకానగర్, నమస్తే ఎల్లంపల్లి: రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం బార్ అసోసియేషన్ ఎన్నికలలో కోశాధికారిగా విజయం సాధించిన ముక్కాల రామకృష్ణ ముదిరాజ్ ను పార్టీలకు అతీతంగా చిలుక నగర్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చిలుకానగర్ డివిజన్ యువజన నాయకుడు దూదేకుల మౌలాలి మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, న్యాయవాది రామకృష్ణ ముదిరాజ్ బార్ అసోసియేషన్ ఎన్నికలలో ఘన విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి మరెన్నో ఉన్నత పదవులు అందుకొని ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిలుక నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బూర్గుల రమేష్ గౌడ్, సీనియర్ పాత్రికేయుడు ఏర్ల కరుణాకర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నాయకుడు మాడుగుల శ్రీనివాస్ యాదవ్, వివేకానంద యువక్ సంఘ్ సభ్యులు తమ్మల పరమేష్ కోణాని మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.