నవతరం

తెలుగు దినపత్రిక

మన ఓటు.. మన హక్కు

* ఓటరు జాబితాలో ప్రతీ ఒక్క ఓటర్ ఉండేలా నాయకుడు, బిఎల్ఏలు పనిచేయాలి

* బిఆర్ఎస్ ఎల్పి విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్

హైదరాబాద్, నవతరం: బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 132- జీడిమెట్ల డివిజన్ లోని ఎం.ఎన్. రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్ లో స్పెషల్ ఇంటెన్షవ్ రివిషన్ (SIR) పై నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ముఖ్యఅతిధిగా హాజరై Special intensive Revision (SIR) కార్యక్రమ నిర్వాహణ, ప్రాముఖ్యత, పాటించవలసిన నియమ, నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. పారదర్శక, కచ్చితమైన ఓటరు జాబితా రూపొందేలా ప్రతీ నాయకుడు, బిఎల్ఏలు పనిచేయాలని అన్నారు. 2002 జనాభా ప్రాతిపదికన ఎన్నికల సంఘం అద్వర్యంలో నిర్వహిస్తున్న ఈ SIR కార్యక్రమంలో నిజమైన ఓటర్లను గుర్తించడంతో పాటు, డూప్లికేట్ ఓట్లు, పర్మినెంట్ మైగ్రేటెడ్ ఓట్లు, అసలు మనుషులు లేని పేర్లతో ఉన్న ఓట్లను గుర్తించడం, కుటుంబ సభ్యుల ఓట్లను మ్యాపింగ్ చేయడం, కొత్త ఓటర్లను చేర్చడం, ఇంకా ఏమైనా చేర్పులు, మార్పులు ఉంటే వాటిని సరిదిద్దేలా నాయకులు, బిఎల్ఏల, సంక్షేమ సంఘాల నాయకులు, సీనియర్ సిటిజన్స్, యువత ఒక బాధ్యతగా తీసుకొని  ప్రజలను చైతన్య పరుస్తూ అధికారులను సమన్వయ పరుచుకుంటూ సర్ కార్యక్రమాన్ని సద్వినియోగ పరుచుకోవాలనేలా పనిచేయాలన్నారు. అనంతరం రానున్న రోజుల్లో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతంకై చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం, నూతన కమిటీల నియామకంతో పాటు పార్టీ బలోపేతానికి మరింత ప్రజల్లోకి ఎలా దూసుకువెళ్లాలనే చేపట్టవలసిన కార్యాచరణను వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కు చెందిన నాయకులు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading