కూకట్పల్లి, మే 01 (నవతరం): పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎప్పుడూ ముందుండి తనకంటూ ఒక ప్రత్యేక సత్తా చాటిన జగద్గిరిగుట్ట కాకతీయ టెక్నో స్కూల్లో ఈ సారి చరిత్రలో మొదటిసారి గా 583 మార్కులు సాధించి తన ప్రతిభను చాటిన విద్యార్థిని దొగిపర్తి దేదీప్య. ఈ సందర్భంగా ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. ప్రథమ స్థానంలో నిలిచి 583 మార్కులు సాధించిన డోగిపర్తి దేదీప్య ను వారి తల్లిదండ్రులు డోగిపర్తి శ్రీనివాస్ నాగమణి లను, ద్వితీయ స్థానంలో నిలిచి 561 మార్కులు సాధించిన పద్దాని వెన్నెల వారి తల్లిదండ్రులు
పద్దాని జనార్ధన్ నిర్మలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ మాట్లాడుతూ నిరంతరం అధ్యాపకుల కటోర శ్రమ విద్యార్థుల కృషి పట్టుదల తల్లిదండ్రుల ప్రోత్సాహం అందరి సమిష్టి కృషి వల్ల ఈ ఫలితాలు వచ్చాయని అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వీరితోపాటు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు పూర్తిస్థాయి ఉత్తీర్ణత శాతం సాధించినందుకు అధ్యాపకులకు విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానంలో నిలుస్తారని భవిష్యత్తులో సాధించే ఘనవిజయాలు వారిని సమాజంలో ఉన్నత స్థానంలో నిలబడతాయని అటువంటి భవిష్యత్తు వారికి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ పి తిరుపతి రావు,ఎ రామేశ్వర్ రావు, పి.సురేష్, ఎస్ శ్రీధర్, రవీంద్ర బాబు, ప్రిన్సిపాల్ కె.ఎస్. ఎన్.మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ టి.పరమేశ్వరి, పి.కవిత ఎం.దుర్గా భవాని, మేరీ,విజయలక్ష్మి, ఆనంద్ మదిలెట్టి, సింధూర్ ప్రబంధన్ తదితరులు పాల్గొన్నారు.






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.