నవతరం, శ్రీకాకుళం: పాలక, ప్రతిపక్షాలు రెండు కలిసి పని చేయడం అరుదుగా చూస్తుంటాం. నేడు శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఏ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్న ఇదే చర్చ జరుగుతోంది. భరత్ అనే నేను సినిమాలో పాలక ప్రతిపక్షాలు కలిసి పనిచేయడం చాలా అరుదుగా జరుగుతుంది….! అని ఆ సినిమాలో ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టు మహేష్ బాబుతో చెప్పడం జరుగుతుంది. అదే విధంగా తల్లి కాంగ్రెస్ పాలన నుండి జిల్లాలో పాలక ప్రతిపక్షాలు అంటే నాడు తెలుగు దేశం పార్టీ, కాంగ్రెస్ కాగా నేడు వైఎస్ఆర్ సిపి, తెలుగు దేశానికి చెందిన ప్రజాప్రతినిధులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం. ఈ జిల్లాలో మరో బలమైన సామాజిక వర్గం ప్రజాప్రతినిధులను అణగదొక్కాలని చూడడమే కాకుండా వారి ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత ఉండదు, ఉండకూడదు అని సుదీర్ఘ కాలముగా కొనసాగుతున్న తంతేనని చెప్పుకోవడం విశేషం. అయితే ఈ నేపద్యంలో నిజమే అని కూడా కొన్ని సంఘటనలు పరిస్థితులు రుజువు చేశాయని కూడా కొంతమంది డంకా పదముగా చెప్పటం వెనుక బలమైన కారణాలు ఏమిటి అన్నది పది రకాలుగా గతం నుండి కూడా చర్చించుకోవడం జరుగుతూనే ఉంది. ఈ తరుణంలో బలమైన సామాజిక వర్గానికి ప్రాధాన్యత దక్కకుండా దశాబ్దాలుగా కూడా ఆణతొక్కేస్తున్నారని వారి కను సన్నలలో మాత్రమే ఉన్నటువంటి ఇతర వ్యక్తులకు ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారికి తప్ప వారిని వ్యతిరేకించిన వారికి సమర్థులకు ఎట్టి పరిస్థితులలోనూ ముందుకు రానివ్వరు ఆయన వాదన రెండు దశాబ్దాలుగా దువ్వాడ తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం విధితమే. మరో సామాజిక వర్గానికి అవకాశం లేకుండా చెయ్యడంలో సఫలమైయారని దువ్వాడ మాటలలో విన్నాం. అయితే దువ్వాడ మాటల్లోనే కాదు. జిల్లాలో కాంగ్రెస్ పాలన నుండి ఈ మాటలు వినిపిస్తున్నాయి. జిల్లాలో నేటి పాలక పక్షం వలన ఎలాంటి లాభాపేక్ష లేకపోయినా జిల్లాలో ఆపార్టీ నేతల మూలంగానే ప్రజలు బతికి బట్టకట్టినట్టే ప్రచారం జరుగుతోంది. ఇక్కడ బలమైన సామాజిక వర్గం కాలింగలు వారికి రాజకీయంగా ప్రాధాన్యత తక్కవనే చెప్పాలి. తరువాత తెలగ సామాజిక వర్గానికి చెందినవారు ఒకప్పుడు కర్నూలు రాజధానిగా ఉన్న రోజులలో స్పీకర్ గా పనిచేసిన రొక్కం లక్ష్మీనారాయణ దొర వారి సోదరులు శాసనసభ్యులుగా రామ్మూర్తి దొర మరియు కాంగ్రెస్ పార్టీ లో త్రిపురాణ రాఘవ దాసు జిల్లా అధ్యక్షులుగా డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గాను పనిచేసే ఫ్రీడమ్ ఫైటర్, ఆయన కుమార్తె త్రిపురాన వెంకటరత్నం శాసనసభ్యురాలుగా మరియు కొద్ది కాలం మంత్రిగా తెలుగుదేశం పార్టీలు నందమూరి తారక రామారావు హయాంలో ప్రధాన కార్యదర్శి గాను చేయటంతో పాటు, మహిళా కమిషన్ చైర్మన్గా కూడా ఆవిడ పదవులు చేపట్టారు. ఆమె సోదరులు త్రిపురాణం రవీంద్ర దాసు తన సామాజిక వర్గానికి నాయకత్వం వహిస్తూనే ఎల్లంపేట మండలంలో వట్టి చేతితో చక్రం తిప్పే సమర్ధుడుగా చెప్పుకోవడం విశేషం అదే విధముగా కోటబొమ్మాలి మండలంలోని దంత పంచాయతీని తాను ఉన్నంతవరకు తన చెప్పు చేతుల్లోనే ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఉంది అని స్థానిక ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు. అదేవిధంగా వైయస్సార్ పార్టీ లో 2014 19 మధ్యకాలంలో రొక్కం సూర్యప్రకాశరావు జిల్లా అధికార ప్రతినిధిగా ఒకే ఒక్కడు అన్నట్టు ప్రతిపక్ష పాత్రను నిర్భయముగా బాధ్యతగా వివరణాత్మక సమస్యలతోనూ పాలక పక్ష తప్పిదాలను ఎండగడుతూ తనదైన శైలిలో ప్రతిపక్షానికి వెన్నులో వణుకు తెచ్చే విధముగా బాధ్యతగా రాష్ట్రస్థాయిలో ప్రతిపక్షాన్ని గుర్తింపు తెచ్చే విధంగా పనిచేశారని చెప్పుటకు అతిశయోక్తి లేదు. తదనంతరం ఏదో కారణాలతో తాను తాత్కాలికంగా పార్టీ మారటం తర్వాత మరల పార్టీలు చేరటం కొన్ని కారణాల వలన తనకు సరైన గౌరవం దక్కడం లేదు దానిని కి ఉన్న సమస్యలు పరిష్కరించి అధిష్టానం తగు విధముగా గుర్తించి ప్రాధాన్యత లేకపోవడం వలన నేటికీ పార్టీలోనే ఉన్న తటస్థంగానే ఉండిపోయారు అన్నది వాస్తవం. నిజానికి ప్రతిపక్షాన్ని బ్రతికించి నిర్భయముగా వాస్తవాలను అందించి చక్కనైన వాగ్దాటితో వివరణాత్మకంగా పాలకపక్షాల లోపాలను తప్పిదాలను నివేదించగలిగిన సమర్థత ప్రజా ఆకర్షణ కలిగిన ముఖ్యమైన వ్యక్తి రొక్కం సూర్యప్రకాశరావు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. కానీ మైనారిటీ అనే ఒక అడ్డుగోడ ఆయనని అడ్డుకుంటుంది అన్నది కూడా నిజమే. ఈ నేపథ్యంలో నేటి ప్రజాస్వామ్య రాజకీయాలు కుల వ్యవస్థ బలపడి సమర్థత, సేవ, ప్రాధాన్యతలు బలహీన పడుతున్న క్రమములో అందుకు ఏమో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో ప్రజలకు న్యాయం చేయలేక కొన్ని వర్గాలకు తగు ప్రాధాన్యత ఇవ్వకపోవడం మరియు అర్హత ఉన్నప్పటికీ కొన్నింటిని పొందలేకపోవడం జరుగుతుందేమో అని రాజకీయం పరిశీలకులు విజ్ఞులు మేధావులు నేడు ఇక్కడ అక్కడ అనకుండా ఆందోళన చెందవలసిన పరిస్థితి బలపడి ఉందని చెప్పక తప్పదు. శ్రీకాకుళం జిల్లా వరకు వస్తే దువ్వాడ సమస్య పక్కన పెడితే రెండు బలమైన సామాజిక వర్గాలు నాలుగు దశాబ్దాలుగా పూర్తిస్థాయిలో రాజకీయ ప్రాధాన్యత క్రమంలో ఉన్నప్పటికీ జనాభా ప్రాతిపదికన అధిక జనాభా కలిగిన సామాజిక వర్గానికి సరైన ప్రాధాన్యత దక్కడం లేదని వాదన మాత్రం అది అప్పటినుండి ఇప్పటివరకు కొనసాగుతూనే ఉన్నది. కారణాలు ఏమో కానీ ఈ వాదనలు మాత్రం చర్చనియాంసముగానే ఉన్న మాట వాస్తవమే. ఈ నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీలైన నిబద్ధతగా ప్రజలకు చెరువవ్వాలి అన్నివర్గాలను ఏకతాటిపై తెచ్చి ముందుకు కొనసాగాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ వివక్షతలు విడనాడి సమర్ధత, చాకచక్యం దృష్టిలో పెట్టుకొని అందరికీ సమన్యాయం సమధర్మం సామాజిక న్యాయం అనే కోణంలో రాజకీయ పార్టీ పదవులలో గాని ప్రజా ప్రభుత్వాలు ప్రజాసంక్షేమాన్ని పరిపాలనను అందించినప్పుడు సంబంధిత వర్గాల అన్నింటిని న్యాయం చేసే విధముగా ముందుకు సాగితే విభేదాలు లేని ప్రశాంతమైన విధముగా ఉంటూ క్రమశిక్షణతో కూడిన రాజకీయ వాతావరణం కొనసాగుతుంది. పాలకులకు రాజకీయ పార్టీలకు వివక్షత ఉండదని అందరినీ సమదృష్టితోనే చూసి ఆదరిస్తారని అది ఆచరిస్తారని ఆశిద్దాం.
నువ్వా నేనా… వేరేవారికి అవకాశమా..?




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































