నవతరం

తెలుగు దినపత్రిక

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఆనంద్ కృష్ణారెడ్డి

*అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న యువత నాయకులు ఆనంద్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి

బొల్లారం, నమస్తే ఎల్లంపల్లి: బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సరస్వతి దేవి మండపం వద్ద సోమవారం రాత్రి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సరస్వతీ దేవి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మున్సిపల్ యువత నాయకులు ఆనంద్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి సరస్వతి దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలనీ వాసులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదాన వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు రవితేజ, సునీల్, మోహన్, బబ్లు, అనసు, రవి, కాలనీవాసులు, భక్తులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading