నవతరం

తెలుగు దినపత్రిక

కుత్బుల్లాపూర్ తహశీల్దార్ కు మహా ఎమ్మార్పీఎస్ మద్దతు

* బహిరంగ క్షమాపణ చెప్పాలి, అదే సోషల్ మీడియాలో వీడియో పెట్టాలి
* మహా MRPS మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు ముత్యపాగ శ్రీశైలం మాదిగ

హైదరాబాద్: కుత్బుల్లాపూర్ తహశిల్దర్ సంజీవరావు ని నరేష్ గౌడ్ అన్నే వ్యక్తీ ఫోన్లో దుర్బాషలాడి,అవమానిచినందుకు మహా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని అన్ని మండల ఆఫీసులలో పెన్డౌన్ చేయవలసిందిగా డిమాండ్ చేశారు ఏమ్మాపీఎస్ నాయకులు. గాజులరామారం విలేజ్ లోని సర్వే నంబర్ 342 లో అక్రమంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహo  విషయంలో దళిత జాతి బిడ్డ అయినటువంటి కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో నీ గౌడ సంఘం నాయకులు నరేష్ గౌడ్ తీవ్ర పదజాలంతో తిట్టి ఒక దళిత ఆఫీసర్ ఆని చూడకుండా అవమాన పరిచి సోషల్ మీడియాలో పెట్టినందుకు నిరసనగా మహా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని అన్ని మండల ఆఫీసులలో పెన్డౌన్ చేయవలసిందిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ముత్యపాగ శ్రీశైలం మాదిగ, మహిళా అధ్యక్షురాలు జాజాల రమ్య మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి డొంక శ్రీరామ్ మాదిగ, జిల్లా ఇన్చార్జ్ దుబ్బాక లక్ష్మణ్ మాదిగ, మీడియా ఇంచార్జ్ రాగాల ఆనంద్ కుమార్ మాదిగ, కుత్బుల్లాపూర్ సర్కిల్ నాయకులు శేఖర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading