– ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ హ్యాక్ పై నిరసన తెలిపిన బీ.ఎస్.పి నాయకులు
– ఫోన్ హ్యాక్ ర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి
– మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ నాయక్
ఉప్పల్, నమస్తే ఎల్లంపల్లి: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐ ఫోన్ ను హ్యాక్ చేశారంటూ బీఎస్పీ నేతల్లో ఒక్కసారి ఆగ్రహజ్వాలలు భగ్గుమన్నాయి. ఉప్పల్ రింగ్ రోడ్ లో గల అంభేద్కర్ విగ్రహం వద్ద బీఎస్పీ నిరసనలు తేలిపారు. ఈ సంధర్భంగా బీఎస్పీ నేతలు మాట్లాడుతూ మా తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం బహుజన రాజ్యాధికార యాత్ర చేస్తూ తెలంగాణాలో బీఎస్పీ బలోపేతానీకి కృషి చేస్తున్నారని అన్నారు. తన ఐపీఎస్ పదవి నుంచి స్వచ్చందంగా విరమణ పొంది ప్రజలకు సేవకై వస్తున్న బీఎస్పీ అధ్యక్షులు ఐ ఫోన్ ను హ్యాక్ చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యాపిల్ సంస్థ నుంచి తన ఫోన్ కి అలర్ట్ వచ్చిందని తన ఫోన్ హ్యాక్ అవుతోందంటూ, యాపిల్ సంస్థ నుంచి మెయిల్ కూడా వచ్చిందని బీఎస్పీ నేతలు వెల్లడించారు. ఫోన్ హ్యాక్ చేస్తున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బీఎస్పీ నేతలు హెచ్చరించారు. దోపిడి నుంచి ప్రజలకు విముక్తి కలిగించి మహానీయులు కలలుగన్న రాజ్యాన్ని తీసు కోస్తామని ప్రజలకు బీఎస్పీ నేతలు పిలుపు నిచ్చారు. ఈకార్యక్రమంలో బీఎస్పీ మేడ్చల్ జిల్లా ఇంఛార్జ్ గౌడ సుదర్శన్, చిన్న గల్లా కుమార్, మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్ రవీందర్ నాయక్, వైస్ ప్రెసిడెంట్ ఎర్రవల్లి మల్లేష్, ఉప్పల్ అసెంబ్లీ అధ్యక్షలు ఎడ్ల పరమేష్, వైస్ ప్రెసిడెంట్ ఎస్ కే వల్లి, పీర్జాదిగూడ ప్రెసిడెంట్ ఇటికల అంబేద్కర్, మేడ్చల్ నాయకులు సుక్క దయానంద్, దమ్మాయిగూడ నాయకులు యం హనుమంత్, బసవగల్ల సిద్దయ్య జనగాం, తదితర నాయకులు పాల్గొన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.