నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం…ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీ
ఆల్విన్ కాలనీ, నమస్తే ఎల్లంపల్లి: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు పాత్ర ఎంతో కీలకమని ప్రభుత్వ విప్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. బుధవారం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని తులసి నగర్ కాలనీ లో (ఎమ్మెల్యే (సిడిపి ఫండ్స్ ), కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు లక్షల డెబ్భై వేల రూపాయల అంచనా వ్యయం తో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, రోజాదేవి రంగరావు, జగద్గిరిగుట్ట సీఐ సైదులు, ఎస్సై శ్రీకాంత్ లతో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుకు తులసి నగర్ కాలనీ వాసులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇతర బస్తీ ,కాలనీ వాసులకు ఆదర్శముగా నిలిచారని కొనియాడారు. అవసరమైతే అదనపు కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి నా వంతు ఆర్థిక సహాయం చేస్తానని దూర దృష్టితో బస్తీలలో భద్రత, ప్రజల రక్షణ ధ్యేయంగా నేడు సీసీ కెమెరాలను ఏర్పాటుకు చొరవ తీసుకోవడం గొప్ప విషయమన్నారు. శాంతి భద్రతలు కాపాడటానికి పోలీస్ అధికారులు ఎంతగానో కృషి చేస్తున్నారని, సీసీ కెమెరాల ఏర్పాటుపై కాలనీ వాసులకు విస్తృత ప్రచారంతో అవగాహన కలిపిస్తున్నారని, ఒక సీసీ కెమెరా 100 మంది పోలిసులతో సమానమన్నారు. సీసీ కెమెరాల వలన నేరాలు సులువుగా పరిష్కారం అవుతాయని, నేర శోధన, నేర నివారణ కు ఎంతో తోడ్పడతాయన్నారు. ఇదే తరహాలో అన్ని కాలనీ వాసులు ముందుకు వచ్చి తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే సీసీ కెమెరాల ఏర్పాటుకు తనవంతు కృషి గా ఎమ్మెల్యే ఫండ్ (సీడీపీ) ద్వారా కోటి రూపాయలు కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాశినాథ్ యాదవ్, మోజేశ్, తులసి నగర్ కాలనీ వాసులు రామ కృష్ణ , చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్, సుకుమార్, ప్రశాంత్, నరేష్, సత్యనారాయణ, రాజు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.