హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: కాంగ్రెస్ నాయకులు జంగా రాఘవరెడ్డి మంగళవారం పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఇటీవల 62 వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ మీద భూ ఆక్రమణ కేసు నమోదు అయ్యిందని పత్రికలలో రావడం జరిగింది.. రవీందర్ యాదవ్ భూ ఆక్రమ చేసే వ్యక్తి కాదు, అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం జరుగుతుంది.ఇతనిపై ఇంతకుముందు ఎన్నడు ఎటువంటి భూ వివదామైన కేసులు నమోదు కావడం గానీ, ఆరోపణలు రావడం రాలేదు… ఏదైతే భూ ఆక్రమణ అని చెప్పబడుతున్న భూమి సర్వే నంబర్ 729/B/1/1 గల దానిలో మొత్తం 47 గుంటల భూమిలో ఒక రిటైర్డ్ టీచర్ బుర్ర విద్యాసాగర్ గౌడ్ సతీమణి పేరు మీద 2012 లో కొనుగోలు చేయడం జరిగింది. తనకు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ పాస్ బుక్ లతో ధరణిలో పేరు ఈసీలో క్లియరెన్స్ ఇవన్నీ ఉన్నటువంటి ఈ భూమిలో 5 గుంటల భూమిని జక్కుల రవీందర్ యాదవ్ కొనుగోలు చేసిన మాట నిజం.లీగల్ గా అన్ని ఉన్నాయి లీగల్ గా ఎలాంటి ప్రాబ్లం లేదు దమ్ముంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రెండు డిపార్ట్మెంట్లు కలిసి సర్వే చేయగలరని చెప్పి ఈ సందర్భంగా తమరికి మనవి చేస్తున్నాను, 1.07 గుంటలలో(ఎకరం ఏడు గుంటలు) నగేష్ అనే వ్యక్తికి 17 గుంటలు, సురేందర్ అనే వ్యక్తికి 25 గుంటలు, రవీందర్ యాదవ్ కు 05 గుంటల భూమి ఉంది. ఈ సర్వే నంబర్ లో ఉండబడిన నగేష్ అనబడే వ్యక్తికి ఉండవల్సిన ప్లాట్ కు రోడ్డు సౌకర్యం కొరకు రవీందర్ యాదవ్ ను పోలీసుల అండదండలతోటి కావాలనే లోకల్ పోలీసులే సిపి దగ్గరికి పంపించి ఈ విధంగా రాజకీయ నాయకుడు చేస్తున్నాడని చెప్పి సిపి ని తప్పుదారి పట్టిస్తున్నారనేది నిజం. దీనిపై సీపీ స్పందించి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి రిఫర్ చేసి రాయడం జరిగింది ఈ కుట్రలో రాజకీయ హస్తం కూడా ఉన్నది. జక్కుల రవీందర్ యాదవ్ పై కుట్ర పూరితంగా కేసులలో ఇరికించాలనే లక్ష్యంతోని అతను నిత్యం ప్రజలతో మమేకం అవుతున్నాడని మరీ ముఖ్యంగా అతను నా అనుచరుడు కాబట్టి అతనిని ఇబ్బందులకు గురిచేయడం కోసం చేసిన కుట్ర.

ఓ రిపోర్టర్ జంగా రాఘవ రెడ్డి అనుచరుడని చెప్పడం జరిగింది అలా చెప్పడంలో తప్పేమీ లేదు ఆపద వస్తే ఒక తీరుగా ఆపద లేకుంటే ఇంకో తీరుగా ప్రవర్తించడం రాఘవరెడ్డి నైజం కాదు. నా అనుచరుడిపై కుట్రపూరితమైన కేసు పెట్టినంత మాత్రాన రాఘవరెడ్డి తప్పించుకునే వ్యక్తి కాడు వందకు వందశాతం జక్కుల రవీందర్ యాదవ్ నా శిష్యుడు అందులో ఎలాంటి సందేహం లేదు, కానీ నా శిష్యుడు తప్పు చేయలేదు వ్యాపారం చేస్తున్నాడు, తప్పకుండా పోలీస్ అధికారులు ఎవరైనా పర్లేదు నిజనిర్ధారణ చేయమని కోరుతున్నాను. మా కార్పొరేటర్ 5 గుంటల భూమి డాక్యుమెంట్ల ప్రకారం కొనుగోలు చేయడం జరిగింది. ఇట్టి భూమిలో ఎలాంటి ఆక్రమణ అనే విషయం లేదు.అటువంటిది జరిగినట్లు నిరూపిస్తే 5 గుంటల భూమికి మరో 5 గుంటల భూమిని ఇవ్వడానికి సిద్ధం.కానీ అనవసరంగా భూ కబ్జాదారుడని పేపర్లో రాయించడం పోలీస్ వాళ్లే ప్రెస్ మీట్ లు పెట్టడం దీనిని తప్పుగా భావిస్తున్నాము దీనిని టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాట్సాప్, ఫేస్ బుక్ లలో పెట్టి భూ కబ్జాదారుడని రూమర్స్ క్రియేట్ చేయడం సరైన పద్ధతి కాదు నిజమైన ఆధారం ఉన్న వాటిని పత్రికలలో రాయడం, నిజాలను ప్రజలకు తెలియజేయడం అవసరం కానీ ఇలా అబద్ధాలు క్రియేట్ చెయ్యడం సరైన పద్ధతి కాదని తమరికి తెలియజేస్తూ పోలీసులైన, పత్రిక మిత్రులైన టిఆర్ఎస్ పార్టీ నాయకులైనా ఆధారాలతో కూడిన ఆరోపణలు చెయ్యాలని ఈ సందర్భంగా తమరికి మనవి చేస్తున్నాను. ఈ కేసు రాజకీయ కుట్రలో భాగంగా నమోదు చేయడం జరిగింది.. ఎందుకనగా ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్స్ మరియు నాయకులపై భూ ఆక్రమణ కేసులు నమోదు అయ్యి జైళ్లకు కూడా వెళ్లడం జరిగింది.. రాబోయేది ఎన్నికల రోజులు కావున దీన్ని మరిపించే విధంగా ప్రతిపక్ష పార్టీ కార్పొరేటర్ అయిన జక్కుల. రవీందర్ యాదవ్ పై కావాలనే ఉద్దేశ్యపూర్వకంగా కేసు పెట్టించడం జరిగింది. కావున ఈ విధంగా ప్రతిపక్ష నాయకులపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ టౌన్ పార్టీ అధ్యక్షులు కట్ల శ్రీనివాస్, కార్పొరేటర్ విజయశ్రీ రజాలి, మాజీ కార్పొరేటర్ తొట్ల రాజు యాదవ్, మాజీ కార్పొరేటర్ రమా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగుల శ్రీనివాస్ రెడ్డి, గుర్రపు కోటేశ్వర్ బోయిని కుమార్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు రేపల్లె రంగనాథ్, హనుమకొండ పశ్చిమ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొడిపాక గణేష్, కంటెస్టు కార్పొరేటర్ సందెల విజయ్, వాస్కుల శంకర్, మండల సమ్మయ్య, రాజారపు స్వామి, బైరి లింగమూర్తి, డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.