* గాలి పోచమ్మ బస్తి పేరుతో భూ కబ్జా * కోట్లు దండుకుంటున్న భూకబ్జాదారుడు నరసింహ * చోద్యం చూస్తున్న రెవెన్యూ, ఏపీ ఎస్ఎఫ్సీ అధికారులు * ఎకరాల్లో మాయమవుతున్న చలనం లేదా? * ప్రభుత్వ భూముల్లో బస్తులు ఏర్పాటు చేస్తున్నా, నిమ్మకు నీరెత్తిన జిల్లా కలెక్టర్ * అమాయక ప్రజలను మోసం చేస్తున్న నకిలీ డాన్లు * ఇంత జరుగుతున్న కార్పొరేటర్ ఏం చేస్తున్నాడు * కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే పరిధిలో గాజులరామారం ఉన్నదా లేదా..? * కబ్జాపతంలో దూసుకెళ్తున్న ఎమ్మెల్యే వివేక్ * వందల ఎకరాల ప్రభుత్వ భూమి మాయమవుతున్న చలనం లేదు ఎందుకు..? * సినిమా స్టోరీని తలపిస్తున్న గాజులరామారం భూకబ్జాలు * వివేకవంతుడు వివేకం కోల్పోయాడా… కూల్చివేతల జరిపితే వీఆర్వోకు బెదిరింపులా…? * వార్తలు రాస్తే విలేకరులపై దాడులు చేస్తారా…? * చర్యలు తీసుకోవాలంటున్న స్థానిక ప్రజలు
కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని గాజులరామారం గ్రామ సర్వే నంబర్ 329/1, 342, 307 లోని ప్రభుత్వ ఏపీ ఎస్ ఎఫ్ సి భూములు మాయం చేస్తూ కోట్ల రూపాయలు దండుకునే పనిలో నిమగ్నమయ్యారు ఇక్కడి కొందరు భూకబ్జాదారులు. గాజుల రామారం డివిజన్లోని ఈ భూకబ్జాలకు వత్తాసు పలుకుతున్నారు స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద. ఏసియా ఖండంలోనే 300 కోట్ల ప్రత్యక్ష భూమాఫియా కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో కనిపిస్తుంది. ఇంత జరుగుతున్నా స్థానిక కార్పొరేటర్ శేషగిరి, ఎమ్మెల్యే వివేకానంద మౌనంగా ఉండటం దేనికి సంకేతం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పేదవాడు ప్రభుత్వ భూమిలో ఒక చిన్న గుడిసె వేసుకుంటే ఉపేక్షించని కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు సుమారు 300 కోట్ల భూమాఫియా పై ఎందుకు స్పందించడం లేదు. దీనెనుక ఉన్న మతలబు ఏంటి. కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో సంజీవరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పరమేష్ రెడ్డి ఆస్తులపై తక్షణమే విచారణ జరిపి ఈ అవినీతి తిమింగాలపై విచారణ జరపాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సర్వే నంబర్ 307 లో జరుగుతున్న భూకబ్జాలను స్థానికంగా ఉన్న ఏపీ ఎస్ ఎఫ్ సి అధికారులే వెన్నంటి ప్రోత్సహిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. గాజులరామారం సర్వే నంబర్ 307 లో ఇప్పటికే సుమారు 50 ఎకరాలకు పైగా ఏపీ ఎస్ ఎఫ్ సి భూములు మాయమయ్యాయి. గతంలో స్పందించిన ఏపీ ఎస్ ఎఫ్ సి మేనేజర్ ప్రభాకర్ ఇక్కడ వెలిసిన అక్రమ నిర్మాణాలను స్థానిక పోలీసుల సహాయంతో నేల కూల్చడం జరిగింది. గత రెండు సంవత్సరాల నుండి ఇక్కడ వెళుస్తున్న అక్రమ నిర్మాణాలను పట్టించుకునే నాధుడే లేడు. వందల కోట్ల ఆస్తులను మాయం చేస్తున్న కబ్జాదారులపై చర్యలు తీసుకోవడానికి ఏపీ ఎస్ ఎఫ్ సి రెవెన్యూ అధికారులు ఎందుకు వెనుకాడుతున్నారు అంటూ స్థానిక ప్రజలు గుసగుసలాడుతున్నారు. గాలి పోచమ్మ బస్తీ పేరుతో స్థానికంగా నివాసముండే టిప్పర్ లారీల డ్రైవరు నరసింహ అతని తమ్ముడు డాన్ శీను ఇప్పటికే సుమారు 10 ఎకరాల ప్రభుత్వ ఏపీఎస్ఎఫ్సి భూములను మాయం చేసి లక్షల రూపాయలు దండుకున్నట్టు స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఏపీ ఎస్ ఎఫ్ సి, రెవెన్యూ అధికారులు నిద్రమత్తులో ఉన్నారా లేక తమ విధులను మర్చిపోయారా అంటూ ఇక్కడి ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
దూసుకుపోతున్న సాయిబాబా దేవేందర్ నగర్ నుంచి కైసర్ నగర్ కి వెళ్లే దారిలో లాల్ సాబ్ కూడా కు చెందిన ఒక బాబా తన సత్తా చాటుకుంటున్నాడు. చేతికి నాలుగు ఉంగరాలు ఒక బ్రాస్లెట్ ఒక బంగారు గడియము, అవసరం అయితే నాలుగు లక్షల రూపాయలు జేబులో పెట్టుకొని తిరుగుతున్న ఒక దొంగ బాబా ఇప్పటికే 300 రూములు ప్రభుత్వ భూమిలో నిర్మించి కోట్ల రూపాయలు దండుకున్నారు. ఈ భూకబ్జాదారునికి తోడుగా ఒక ఫోటోగ్రాఫర్ తన నిత్య జీవితాన్ని అర్పించి తాను కూడా కొన్ని కోట్ల రూపాయలు దండుకున్నాడు. వీరిద్దరికీ తోడుగా కుత్బుల్లాపూర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ పరమేష్ తనకేమీ తెలియదు అన్నట్టు వ్యవహరిస్తూ అందిన కాడికి దన్నుకుంటూ తన ఆస్తులను పెంచుకుంటున్నాడు. ఈ పరమేష్ రెడ్డి అక్రమ ఆస్తులపై సిబిసిఐడి ఎంక్వయిరీ వేసి లంచగొండి చిట్టా తేల్చాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించిన కుత్బుల్లాపూర్ తహసిల్దార్ తనకేమి తెలియదన్నట్టు.. డమ్మి రూములను కూల్చివేస్తూ రికార్డులు ఫైల్ చేస్తూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కి పంగనామాలు పెడుతున్నాడు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్లోని దేవేందర్ నగర్, కైసర్ నగర్ మధ్యలో ఉన్న 100 ఎకరాల ప్రభుత్వ భూమిని మాయం చేస్తున్న భూ కబ్జాదారులకు కొమ్ముకాస్తున్న స్థానిక తహసిల్దార్ సంజీవరావు పై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా లేక థర్డ్ పార్టీ కమిటీ వేసి పూర్తి విచారణ చేసి, సమగ్ర విచారణ ఫైలు జిల్లా కలెక్టర్ పొందుతారా లేరా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు స్థానిక ప్రజలు. అంతేకాకుండా గాలి పోచమ్మ బస్తీ పేరుతోనే 10 ఎకరాలకు పైగా ప్రభుత్వ ఏపీ ఎస్ఎఫ్సి భూములను అపహరించిన టిప్పర్ లారీ డ్రైవర్ నరసింహ, అతని తమ్ముడు డాన్ శీను పై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ఎదురుచూస్తున్నారు రావి నారాయణ రెడ్డి నగర్ ప్రజలు. ఈ భూకబ్జాలకు వత్తాసు పలుకుతున్న గతంలో ఒక ఫోటో స్టూడియో నడుపుకుంటూ తన జీవితం కొనసాగించేవాడు. ఇంతలో ఏమైందో తెలియదు గానీ తన అన్న భూకబ్జాదారుడు అయినటువంటి బురదరాజు తన పేరుతో ఒక బస్తీని ఏర్పాటు చేసుకొని బంగారు తెలంగాణలో ఆంధ్రుడు బస్తి తో సత్తా చాటుకుంటున్న వ్యక్తికి అనుచరులుగా ఉన్న నకిలీ అడ్వకేటు నేను లాయర్ ను అని చెప్పుకుంటూ… సంతకం కూడా చేయలేని స్థితిలో ఉన్న బాబు ఇప్పటికే ఐదు కోట్ల రూపాయలు దండుకున్నట్లు విశ్వాసనీయ సమాచారం. బంగారు తెలంగాణలో ఒక ఆంధ్రుడు బస్తి ఏర్పడ్డది అంటే స్థానిక కార్పొరేటర్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అలసత్వం ఎంత ఉందో… ఇట్టే అర్థమవుతుంది. ఇకనైనా గాజులరామారం డివిజన్ సర్వే నంబర్ 307లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గత రెండు రోజుల క్రితం స్థానిక టిఆర్ఎస్ యూత్ నాయకులు షేక్ అబీద్… మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో, రెవెన్యూ ఇన్స్పెక్టర్కు ఒక ప్లాట్ కి మూడు లక్షల చొప్పున మొత్తం చెప్పినా ఫలితం లేకుండా పోయిందని, తన భూకబ్జాలతో సత్తా చాటుకుంటున్నారని, ఇకనైనా అసలు దొంగలను గుర్తించి శిక్ష వేయాలని చేసిన వ్యాఖ్యలు నిజమేనా.. ఈ మాటలపై ఇప్పటికీ ఎమ్మార్వో స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గాజులరామారం డివిజన్ ప్రజలు. వేచి చూడాలి ఏం జరుగుతుందో…
You must be logged in to post a comment.