* ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి
* మేడ్చల్ జిల్లా టీయూడబ్ల్యూజే (ఐజేయు) అధ్యక్షులు గడ్డమీద బాలరాజ్
* కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ యూనియన్ అధ్యక్షులు కోటగడ్డ శ్రీనివాస్
* కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ యూనియన్ జాయింట్ సెక్రటరీ ఎల్లంపల్లి డిమాండ్
కుత్బుల్లాపూర్, జులై 28 (నమస్తే ఎల్లంపల్లి): ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని టీయూడబ్ల్యూజే (ఐజేయు) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర, జిల్లా కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోటగడ్డ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు గడ్డమీద బాలరాజు మాట్లాడుతూ… మలిదశ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు జర్నలిస్టులు ఎలాంటి లబ్ధి పొందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి ఉద్యమకారుడు, నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ముఖ్యంగా జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు, జేహెచ్ఎస్ హెల్త్ స్కీమ్ హామీలను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని సూచించారు. గత తొమ్మిది సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల గురించి అనేక సందర్భాలలో ప్రస్తావించడమే కాకుండా జర్నలిస్టుల అందరికీ జిల్లాల వారీగా ఒకే సముదాయంలో ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. సొంత రాష్ట్రంలో ఆత్మగౌరవంతో బతకవచ్చన్న ఉద్దేశంతో నాడు జర్నలిస్టులు వారి ఉద్యోగాలను సైతం పణంగా పెట్టి పోరాడిన విషయాన్ని స్వయంగా కేసీఆర్ ప్రస్తావించి ప్రశంసించిన విషయాన్ని ఇప్పుడు మర్చిపోయినట్టుగా నటిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులందరికీ ఇళ్ల పట్టాలు అందజేయడంతో పాటు వారి ఆరోగ్య భద్రత కోసం జేహెచ్ఎస్ స్కీంను పకడ్బందీగా అమలు పరచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో టీయుడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కన్వీనర్ కె.లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగేంద్ర చారి, దయాకర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ కోశాధికారి శేషారెడ్డి, జాయింట్ సెక్రటరీ ఎల్లంపల్లి నర్సింలు, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, కల్కి మూర్తి, మద్దయ్య, ఎల్లారెడ్డి, గ్రంధాలు, నర్సింగ్, అన్వర్, నాగబాబు, నాగరాజు, యాదగిరి, కుమార్, సాయి, తదితరులు పాల్గొన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.