నవతరం

తెలుగు దినపత్రిక

వార్తలాప్ కి ముఖ్య అతిథిగా హాజరైన ఈటల రాజేందర్

మేడ్చల్ – మల్కాజ్గిరి: ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో..(PIB) కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేడ్చల్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన “వార్తలాప్” కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద్, మర్రి రాజశేఖర్ రెడ్డి, కలెక్టర్ పి. గౌతమ్ పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలను రకరకాల మాధ్యమాల ద్వారా ప్రజల వద్దకు తీసుకుపోవడం, ప్రజల అవసరాలను తెలుసుకోవడం అవసరం.
పథకాలు అన్ని ప్రజల డబ్బుతో అందించేవి తప్ప పార్టీలు ఇచ్చేవి కావు.

PIB, ఐ &పిఆర్ ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా ప్రజల వద్దకు తీసుకొని పోవాలి.

ఈ డిపార్ట్మెంట్స్ కి  కావాల్సినంత మానవ వనరులను అందించాలని ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నాను.

ప్రభుత్వ పథకాలు అందరికీ సమానంగా అందేలా చూడాలి.
అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.
రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి.
మన బాస్ చట్టం, సిస్టం తప్ప లీడర్లు కాకూడదు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను మారుమూల ప్రాంతాలకు అందించే విధంగా పి.ఐ.బి పని చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading