నవతరం

తెలుగు దినపత్రిక

జీడిమెట్ల పోలీసులకు అభినందనలు

* సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

కుత్బుల్లాపూర్ / హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తప్పుడు డాక్యూమెంట్లు సృష్టించి వాళ్ళ భూములను లాక్కునే వాళ్ళను గుర్తించి వారిని అరెస్టు చెయ్యడం అభినందనీయమని వారు పత్రికప్రకటానలో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో కబ్జారాయులు అనేక ప్రభుత్వ భూములను కబ్జాచేసి ప్రజలకు తప్పుడు పత్రాలను చూపి లక్షలకు అమ్మి మోసం చేసారని,నేడు ఆ ప్రాంతాలో నివసిస్తున్న ప్రజలు ఎప్పుడు హైడ్రా వచ్చి కూలుస్తోందొనని భయంతో బతుకుతున్నారని అన్నారు. ఆ సృష్టించిన పత్రాలు భూములు అమ్ముకోవడానికే కాకుండా ఆ పేపర్లతో ఎలక్ట్రిక్ మీటర్లు,టాక్స్ లు, మంచి నీటి కనెక్షన్,డోర్ నంబర్ లు ఇలాగ అన్నింటికి ఉపయోగించారని,కావున ఆ కబ్జాదారులను అరెస్టు చెయ్యడమే కాకుండా వాళ్ళ వల్ల మోసపోయిన వారిని గుర్తించి,కబ్జాదారులు మోసంతో పెంచుకున్న ఆస్తులను జప్తు చేసి ప్రజలకు న్యాయం చెయ్యాలని విజ్ఞప్తి చేసారు.వాటి వెనుకాల ఉన్న అధికారులను అరెస్టు చెయ్యాలన్నారు. నేటికీ భూకబ్జాదారులు వాళ్లు కబ్జా చేసి కాలనీలుగా ఏర్పరిచి అందులో మధ్యలో ఖాళీగా ఉన్న స్థలాలలో గదులను నిర్మిస్తున్నారని, గతంలో సిపిఐ గా పోరాటం చేసి, విజ్ఞప్తుల పై ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించట్లేదని, ఉద్యమాన్ని మరొకసారి నిర్మిస్తామని అన్నారు. అనేక ప్రాంతాలో నిర్మించిన బస్తిలో ఇలాగే అక్రమ పత్రాలను సృష్టించి ఉండవచ్చని కావున వాటి పై కూడా సమగ్ర దర్యాప్తు చెయ్యాలని పత్రిక ప్రకటన ద్వారా పోలీస్ అధికారులను కోరారు. గతంలో చింతల్ చెరువు లో హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తే మళ్ళీ అక్కడ నిర్మాణాలు మొదలు పెట్టారని సమాచారం ఉందని, కావున వాటి పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading