* ఫోన్ ట్యాపింగ్ అంశంపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు
డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ప్రెస్ మీట్
* ఫోన్ ట్యాపింగ్ కు ఆద్యం పోసిందే కాంగ్రెస్
* సిఎం ఆదేశాలతోనే బీఆర్ఎస్ పై దుష్ప్రచారం.
* పోలీసులు కాంగ్రెస్ కుట్రలో పావులు కావొద్దని సూచన
* రేవంత్ రెడ్డికి విచక్షణ, ఙ్ఞానం, భద్రతపై అవగాహన లేదు.
* కేటిఆర్, చంద్రబాబు వలే దొడ్డిదారిన రాజకీయాల్లోకి రాలేదు.
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి లీకులు ఇచ్చి బిఆర్ఎస్ పార్టీ, నాయకులపై ఫేక్ ప్రచారం చేయిస్తున్నారు..
ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో అంతర్గత భద్రత,శాంతి భద్రతలకు భంగం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరిక..
రాష్ట్రంలో ఉన్న భద్రతా విధానాల గూర్చి బహిరంగంగా మాట్లాడడం సరైంది కాదు.
తెలంగాణలో భద్రతా వైఫల్యాల లోపాల గురించి,ప్రభుత్వం అనుసరించే ఇంటలిజెన్స్ వ్యవస్థల పనివిధానం గురించి,పక్క దేశాలు పాకిస్థాన్,బంగ్లాదేశ్, చైనా వంటి దేశాలు కూడా గమనిస్తుంటాయని హితవు.
ట్యాపింగ్ అంశంపై సిట్ అధికారులు,లేదా కమీషనర్ అవసరమైతే ప్రెస్ మీట్ పెట్టి వివరాలు చెప్పాలని,సున్నితమైన అంశంపై రాజకీయాలు తగవు.
ట్యాపింగ్ పై విచారణ చేస్తున్నది సిట్ అధికారులా లేదా గాంధీ భవన్ లో ఉన్న కాంగ్రెస్ నాయకులా అంటూ ప్రశ్న?
తెలంగాణ సిఎం,ఆయన వ్యక్తిగత టీం,గాంధీభవన్ నుండే లీకులు వస్తున్నాయని ఆరోపణ.
ఈ లీకులను ఆధారంగా చేసుకుని మీడియా దుష్ప్రచారం చేస్తుందని,వ్యక్తుల పరువుకు భంగం కలిగేలా తప్పుడు ప్రచారం చేస్తే మీడియా పేరుతో దాడి చేయడం దారుణమన్నారు.
అభిమాన నాయకులపై ఫేక్ ప్రచారాలు చేయడాన్ని తట్టుకోలేక, ప్రజలు దాడి చేస్తే దానికి ప్రభుత్వమే కారణమని స్పష్టం.
గతంలో గౌరవ హైకోర్టు మరియు సుప్రీం కోర్టు ట్యాపింగ్ అంశంపై కథనాలు రాయొద్దని సూచించినా, కొన్ని మీడియా సంస్థలు పట్టించుకోవడం లేదని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21,వ్యక్తిగత గౌరవాన్ని,హక్కులను కాలరాసే హక్కులు లేవని స్పష్టం.
ఫోన్ ట్యాపింగ్ అంశం పూర్తిగా పోలీసు శాఖకు సంబంధించిన విషయమని,రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టం.
ఏ ముఖ్యమంత్రి అయినా ఫలానా నెంబర్లు ట్యాప్ చేయాలని చెప్పరని,రాష్ట్ర భద్రత కోసం పోలీసులే ట్యాప్ చేస్తారు.
సిట్ విచారణలో ఏం జరుగుతుందో ఏం ఆధారాలు లభించాయో వివరాలు కేవలం అధికారులే చెప్పాలి. కానీ,తెలంగాణలో రాజకీయ నాయకులు వివరాలు చెబుతుండడం దారుణం.
బిఆర్ఎస్ ప్రభుత్వానికి,కెసిఆర్ గారికి ట్యాపింగ్ తో సంబంధం లేదు.
బిఆర్ఎస్ నాయకులు ఫోన్ ట్యాపింగ్ బాధితులు మాత్రమే.
బిఆర్ఎస్ పార్టీ ప్రజల నుండి ,ప్రజలను నమ్ముకొని,ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే అధికారంలోకి వచ్చింది.
అంతేకాని ట్యాపింగ్ ను నమ్ముకొని,ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ నమ్ముకొని కాదు.
ఫోన్ ట్యాపింగ్ ప్రారంభమైందే కాంగ్రెస్ పార్టీ పాలనలోనే.
ఫోన్ ట్యాపింగ్ చేసి ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయాలని చూశారు.
ఫోన్ ట్యాపింగ్ చేసి నాటి ఉద్యమకారులను వేధించారు.
2001లో బిఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుండి బిఆర్ఎస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు.
ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని స్వయంగా ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకరే డిజిపికి ఫిర్యాదు ఇచ్చారని గుర్తు చేశారు.
హిమాచల్ ప్రదేశ్ లో బిజెపి ప్రభుత్వం కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలో కూడా ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు వచ్చాయి.
పదవ తరగతి పేపర్ లీక్ చేసిన బిజెపి ఎంపి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నారు.
పేదల భూములు కబ్జా చేసిన బిజెపి రఘునందన్ రావు కూడా ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నాడు. గిరిజనులు భూముల కోసం పోరాడితే గిరిజనుల పక్షాన నిలబడకుండా సెటిల్ మెంట్లు చేసిన వ్యక్తి రఘునందన్ రావు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎవరు పిలవకున్నా ఆయనే అధికారులకు ఫోన్ చేసి వెళ్లి వాంగ్మూలం ఇస్తున్నారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెగాసెస్ స్పైవేర్ ను ఉపయోగించి దేశంలోని ప్రముఖ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడంపై బిజెపి నాయకులు స్పందించరా?
బిజెపి పార్టీకి 5592 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు రావడానికి ఫోన్ ట్యాప్ కారణం కాదా? బిజెపి నాయకులు చెప్పాలి.
తెలంగాణలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉంది. సైబర్ పెట్రోలింగ్ టీంలు ఉన్నాయి.. అయినా బిఆర్ఎస్ పై ఫేక్ ప్రచారం, వ్యక్తిగతంగా పరువుకు భంగం కలిగేలా మాట్లాడితే,వార్తలు ప్రసారం చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు?
ఐటి చట్టంలోని సెక్షన్ 67 ప్రకారం సుమోటో కేసు ఎందుకు పెట్టడం లేదు.
పోలీసులు కేవలం రేవంత్ రెడ్డి ఇచ్చే అక్రమ ఆదేశాలను పాటించి ప్రభుత్వ కుట్రల్లో పావులుగా మారొద్దు.
ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ లోని సెక్షన్ 5 స్పష్టంగా చెబుతోంది ఫోన్ ట్యాపింగ్ గురించి. కానీ పోలీసులు చట్టాన్ని పట్టించుకోవడంలేదు.
అందుకే రాజకీయ నాయకులు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మనసుమమత,చిన్నారి పెళ్లి కూతురు,కబీ సాస్ బి బహుతి వంటి సీరియల్స్ వలే సాగదీస్తున్నారు.
మాజీ ఎస్ఐబి అధికారి ప్రభాకర్ రావు అగ్రికల్చర్ యూనివర్సిటీ లో చదివి,బ్యాంక్ ఉద్యోగం చేసి,ఆ తర్వాత 1991లో డిఎస్పీ ఉద్యోగం సాధించారు.
16 ఏళ్ల పాటు ఇంటలిజెన్స్ పనిచేసి టిడిపి,బిజెపి,కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఎన్నో అవార్డులు పొందారు.
పోలీసులకు ఇచ్చే అత్యున్నత పథకం కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.
చంద్రబాబు నాయుడు ఉత్తమ సేవా పథకం ఇస్తే,అమిత్ షా ఉత్తమ ఇంటలిజెన్స్ అధికారి అంటూ అవార్డు ఇచ్చారు,ప్రణబ్ ముఖర్జీ,రామ్ నాథ్ కోవింద్ నుండి అవార్డు పొందిన ఆఫీసర్ ప్రభాకర్ రావు.
కానీ కాంగ్రెస్ ఈ అధికారిని కావాలని హింసిస్తుంది. బిజెపి నాయకులు కూడా కాంగ్రెస్ తో మిలాఖతై, కాంగ్రెస్ ఇచ్చే ఎంగిలి మెతుకులు,బొక్కలకు ఆశపడి ఫేక్ ప్రచారం చేస్తున్నారు.
ఒక నెంబర్ ట్యాప్ చేయాలంటే ఒక్క అధికారి వల్ల కాదు. ఎస్ఐబి ఛీఫ్ తో పాటు,ఇంటలిజెన్స్ డిజిపి మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ హోం శాఖ అనుమతి ఇవ్వాలి.
3 రోజుల్లో అనుమతి ఇస్తే ఆ నెంబర్ ట్యాప్ చేస్తారు,7 రోజుల్లో అనుమతి ఇవ్వకపోతే ట్యాప్ చేయడం కుదరదు.
ఒకవేళ నిజంగానే ఫోన్ ట్యాపింగ్ నిబంధనలకు విరుద్ధంగా జరిగితే ఆనాటి ఇంటలిజెన్స్ డిజిపి,హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలను ఎందుకు ప్రశ్నించడం లేదు?
వారి పేర్లు ఎందుకు బయటకు చెప్పడం లేదు?
ఇంటలిజెన్స్ విభాగాల గురించి ఏం తెలుసు అని మహా న్యూస్ వంటి ఛానెల్స్ మాట్లాడుతున్నాయి.
పండ్లు,కూరగాయలు,పూలు అమ్ముకునేవారు కూడా నేడు ట్యాపింగ్ మరియు ఇంటలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు.
ఒక్క ప్రభాకర్ రావును మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. ఆయన ప్రాణాలకు తెగించి ఎన్నో త్యాగాలు చేసి అవార్డులు,పథకాలు సాధించినందుకా?
ఆయన క్యాన్సర్ పేషెంట్,అయినా ఉద్యోగం చేస్తే, అతన్ని వేధింపులకు గురిచేస్తూ కేసిఆర్ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పాలంటున్నారు.
సుప్రీం కోర్టు ఆగస్టు 5 వరకు అతన్ని అరెస్టు చేయొద్దని చెప్పినా,ఆరు సార్లు విచారణకు హాజరై సహకరించినా కావాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
ప్రభాకర్ రావు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని తొలగించారు.
ఇంత జరుగుతున్నా ఐపిఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ పట్టించుకోవడం లేదు ఎందుకు?
గతంలో రేవంత్ రెడ్డి మహేందర్ రెడ్డిని ఉద్దేశించి తప్పుగా మాట్లాడితే ఖండించిన ఆఫీసర్లు, ఇపుడు ప్రభాకర్ రావును ఇడియట్,పబ్లిక్ గా కాల్చి చంపాలని అంటున్నా ఎందుకు స్పందించట్లేదని ఆవేదన.
తప్పు చేసినట్లు నిరూపణ జరిగితే అరెస్టు చేయాలి కానీ వేధింపులకు గురి చేయవద్దని సూచన.
గతంలో ఇలాగే పంజాబ్ లో ఐపిఎస్ అధికారులను వేధిస్తే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు.అలాంటి ఘటనలు తెలంగాణలో పునరావృతం కావొద్దన్నారు.
ట్యాపింగ్ అనేది అన్ని రాష్ట్రాల్లో జరుగుతుందని,దేశ రక్షణ, అంతర్గత భద్రత కోసం చేస్తారన్నారు.
దీనిపై అవగాహన లేక రేవంత్ రెడ్డి ప్రతీకారంతో, అజ్ఞానంతో,ఎలాగైనా కేసిఆర్,కెటిఆర్,హరీష్ రావును జైలుకు పంపాలనే కుట్రతోనే ఇలా చేస్తున్నారన్నారు.
చంద్రబాబు నాయుడు సతీమణిని వైసిపి నాయకుడు దూషిస్తే ఆయన అసెంబ్లీలో కన్నీరు పెట్టుకున్నారు,ఖండించారు.
మరి కేటిఆర్ గురించి తప్పుగా వార్తలు ప్రసారం చేస్తే మాట్లాడొద్దా.?
కేటిఆర్ చంద్రబాబు లాగ దొడ్డిదారిన రాజకీయాల్లోకి రాలే.. ఉద్యమం చేసి ,జైలుకు వెళ్లి,కష్టపడి త్యాగం చేసి, పదేళ్లు మంత్రిగా పనిచేసి అనుభవం కలిగిన రాజకీయ నాయకుడిగా ఎదిగారు.
ఆయనను ఏమన్నా పర్లేదా? మహా న్యూస్ ఛానల్ ఏమైనా రాయొచ్చా?
అందుకు ప్రజలు అభిమానులు ఆవేశానికి గురై దాడి చేశారు.
దాడి ఎవరు చేసినా తప్పే కానీ
డిప్యూటి ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పవన్ కళ్యాణ్,కాంగ్రెస్,బిజెపి,టిడిపి,సిపిఐ నాయకులు కూడా ఖండించడం హాస్యాస్పదం.
చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలు డెక్కన్ క్రానికల్ ఆఫీసును తగలబెట్టలేదా?
మీకో న్యాయం బిఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయమా?
మహా న్యూస్ తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసే ఛానల్, ఉద్యమకాలం నుండి తెలంగాణకు విరుద్ధంగా సమైక్య వాదన వినిపించిన ఛానల్.
మహా న్యూస్ వంటి ఛానల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ అంశంపై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు పెట్టడం లేదు.
కాళోజీ టివి ఛానల్ లో ఒక ఐపిఎస్ అధికారిని ఇడియట్ అని,పబ్లిక్ లో కాల్చి చంపాలని మాట్లాడితే పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు?
కాళోజీ పేరు పెట్టుకొని ఇలాగేనా మాట్లాడేది? కాళోజీ నారాయణరావు ఇదే నేర్పించారా? మీడియా విలువలు ఇవేనా?
89 క్రిమినల్ కేసులున్న రేవంత్ రెడ్డి హోం మరియు ముఖ్యమంత్రిగా ఉంటే ఇలాగే జరుగుతుందని స్పష్టం.
బిఆర్ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్ ను అరెస్టు చేసి, ఇప్పటికీ ఎందుకు అరెస్టు చేశారో ఎఫ్ఐఆర్ చేయడం లేదు. అంతా రేవంత్ ఆదేశాలతోనే నడుస్తుంది.
మీడియాపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం కానీ,అందుకు కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన లీకులు,ఫేక్ ప్రచారాలే.
ప్రజలు ఆగ్రహావేశాలకు గురయ్యేలా వ్యక్తుల పరువుకు నష్టం కలిగేలా మీడియా ప్రచారం చేయడమే.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను చూసి,స్థానిక ఎన్నికల్లో ఓటమి పాలవుతామనే భయంతో,బనకచర్ల అంశంలో రేవంత్,చంద్రబాబు ఏకమై కుట్ర చేస్తున్నారని బిఆర్ఎస్ నాయకులు ప్రజల ముందు పెట్టడంతో తట్టుకోలేక ట్యాపింగ్ పేరుతో ప్రతీకార కుట్రలు చేస్తున్న రేవంత్.
గురుకులాల్లో ఇప్పటికీ 90 మంది విద్యార్థులు చనిపోయారు, నిన్ననే షేక్ పేటలో విద్యార్థి చనిపోయారని ప్రశ్నిస్తే తట్టుకోలేక, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై నిలదీస్తే భరించలేక కుట్రలు..
సిద్దరామయ్యను కామారెడ్డికి తీసుకొచ్చి బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తానని హామి ఇచ్చి మోసం చేశారని ప్రశ్నించినందుకే రేవంత్ సర్కార్ కు కోపం.










































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.