నవతరం

తెలుగు దినపత్రిక

క్రీడలతో మానసికోల్లాసం

* క్రీడలతో మానసికోల్లాసం: సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.
* సైబరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నూతనంగా ఏర్పాటుచేసిన ఫుట్ బాల్ గ్రౌండ్ ను ప్రారంభించిన సీపీ
* విన్నరప్ గా సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ టీమ్, రన్నరప్ గా లా అండ్ ఆర్డర్ టీమ్

సైబరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని పరేడ్ గ్రౌండ్ లో నూతనంగా ఏర్పాటుచేసి ఫుట్ బాల్ గ్రౌండ్ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపిఎస్., ప్రారంభించారు. కాగా ఫుట్ బాల్ గ్రౌండ్ లో ప్రారంభించిన వెంటనే మొట్టమొదటి మ్యాచ్ జరగడం విశేషం. శనివారం జరిగిన ఫుట్బాల్ మ్యాచ్ లో సివిఆర్ హెడ్ క్వార్టర్స్ vs లా అండ్ ఆర్డర్ సిబ్బంది హోరాహోరీగా తలపడ్డారు. ఈ ఫుట్ బాల్ మ్యాచ్ లో విన్నరప్ గా నిలిచిన సైబరాబాద్ హెడ్ క్వార్టర్స్ టీమ్, రన్నరప్ గా నిలిచిన సైబరాబాద్ లా లాండ్ ఆర్డర్ సిబ్బందికి సీపీ బహుమతులు అందజేశారు. అలాగే ఈ మ్యాచ్ లో బెస్ట్ ప్లేయర్ గా సిఆర్ హెడ్ క్వార్టర్స్ పీసీ సందీప్ నిలవగా, మెయిన్ రిఫరీగా హెడ్ కానిస్టేబుల్ ప్రతాప్ నిలిచారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..
పోలీసులు శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి, మానసి కోల్లాసానికి క్రీడలు దోహదపడతాయన్నారు. క్రీడలు వ్యక్తిలోని నాయకత్వ లక్షణాలను తట్టి లేపడంతో పాటు టీమ్ స్పిరిట్, ఐకమత్యాన్ని పెంచుతాయన్నారు. క్రీడలు మానసిక స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయ‌ని ఓ జర్మన్ తత్వవేత్త చెప్పిన మాటను ఉదహరించారు. ఆటల్లో గెలుపోటములనేవి సహజమన్నారు. గెలుపోటముల కంటే టీమ్ స్పిరిట్ గొప్పదన్నారు. క్రీడలు మనలో దాగున్న శక్తి సామర్థ్యాలను, పోరాట పటిమను వెలికి తీస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ కమీషనర్ అవినాష్ మహంతి, ఐపీఎస్., డీసీపీ సింగన్వార్ కల్మేశ్వర్, ఐపీఎస్., డీసీపీ సైబర్ క్రైమ్స్ రితిరాజ్, ఐపీఎస్., విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ డిసిపి కవిత, సిఏఆర్ ఏడిసిపి రియాజ్, సీఎస్ డబ్ల్యూ ఏడీసీపీ వెంకట్ రెడ్డి, ఏడీసీపీ వెల్ఫేర్ శ్రీనివాస్, ఏసీపీలు, సీనియర్ హెడ్ క్వార్టర్స్ సిబ్బంది, మినిస్ట్రీయల్ స్టాఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading