నవతరం

తెలుగు దినపత్రిక

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి

* అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయాలని ఎమ్మెల్యే కు వినతి

కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జర్నలిస్టులు ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ను ఆయన నివాస కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి అర్హులైనా జర్నలిస్టులకు ప్రభుత్వా సంక్షేమ పథకాలు అందజేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసిఆర్ కట్టుబడి ఉన్నారని, తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ పాత్ర గుర్తించి, ఇళ్ళ స్థలాలను అందించడం జరిగింది, ఇప్పుడు జరుగుతున్నా అసెంబ్లీ సమావేశాలలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంగం మేడ్చల్ ప్రెసిడెంట్ జి. బాలరాజు, కుత్బుల్లాపూర్ ప్రెసిడెంట్ కే శ్రీనివాస్, సాయిబాబా, జిల్లా నాయకులు దయాకర్ రెడ్డి, కే వెంకట్, డి రామస్వామి, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading