నవతరం

తెలుగు దినపత్రిక

ఉపాధి చట్టం ఉసురు తీయొద్దు

* కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

హైదరాబాద్, నవతరం: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును మార్చాలన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ గ్రామీణ పేదల చెమటతో నడిచే చారిత్రాత్మక ఉపాధి పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడం గాంధీజీకి మాత్రమే కాదు, దేశంలోని కోట్లాది గ్రామీణ పేదలకు చేసిన ఘోర అవమానమని మండిపడ్డారు. ఇప్పటికే ఈ పథకానికి నిధులు తగ్గించడం, బకాయిలు పెంచడం, పనిదినాల్లో కోతలు విధించడం ద్వారా గ్రామీణ ఉపాధి హక్కును బలహీనపరుస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు రాజకీయ ద్వేషంతో మహాత్మా గాంధీ పేరు కూడా తొలగించాలనుకోవడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వం హయాంలో అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ సంకల్పంతో గ్రామీణ పేదలకు గౌరవప్రదమైన ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఈ పథకం ద్వారా గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు గణనీయంగా తగ్గాయని, నిరుపేద కుటుంబాలకు జీవనాధారం కలిగిందని పేర్కొన్నారు. ఈ రోజు మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తొలగించడం అంటే గ్రామీణ భారతానికే అవమానమని, ఇది గ్రామీణ ఉపాధి హక్కును నిర్వీర్యం చేసే కుట్రగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ పేరును తొలగించే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తుందని హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూర వజ్రేస్ యాదవ్, కుత్బుల్లాపూర్, ఉప్పల్ నియోజకవర్గాల కాంగ్రెస్ ఇన్‌చార్జీలు కోలన్ హనుమంత్ రెడ్డి, మందమల్ల పరమేశ్వర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు భూపతి రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింహా యాదవ్, జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లక్ష్మి, ఓబీసీ సెల్ అధ్యక్షులు రవి ముదిరాజ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు పత్తి కుమార్, ఎస్టీ సెల్ అధ్యక్షులు గణేష్, సేవాదళ్ అధ్యక్షులు షఫీఉద్దీన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొమ్మక్ అజయ్, సిహెచ్ బుచ్చిరెడ్డి, మోతే శ్రీనివాస్ యాదవ్, బాలప్ప, కూన రాఘవేంద్ర గౌడ్, రమేష్ మంజుల్కర్, షాకీర్, కృష్ణ యాదవ్, చోటు, తోకల శ్రీను, తోఫిక్, ప్రసాద్, సుజిత్ రెడ్డి, భూషణం గౌడ్, జహంగీర్, రాజిరెడ్డి, అఖిల్, రామకృష్ణారెడ్డి, భరత్, నరసింహారావు, మురళి, వీరబాబు, నరేందర్ మరియు అన్ని నియోజకవర్గాల ఏ అండ్ బి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ అధ్యక్షులు, కార్పొరేషన్ డివిజన్ అధ్యక్షులు, మాజీ మేయర్లు, మాజీ చైర్మన్లు, మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఎస్టీ, సేవాదళ్ విభాగాల నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని నిరసనకు మద్దతు తెలిపారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading