నవతరం

తెలుగు దినపత్రిక

ఎన్ టీవీ జర్నలిస్ట్ లకు బెయిల్ మంజూరు

హైదరాబాద్, నవతరం: అందరిదీ ఒకటే మాట. పోలీసులు.. జర్నలిస్టులను టార్గెట్ చెయ్యడమేంటి అని. పోలీసులు ఏం చెయ్యాలో అది చెయ్యకుండా.. జర్నలిస్టులపై పడటమేంటి అని రాజకీయ నేతలు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. తెలంగాణలో రాజకీయంగా, మీడియా వర్గాల్లో సంచలనం రేపిన ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్ కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఎన్టీవీ ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్ సుధీర్‌లను పోలీసు కస్టడీ (రిమాండ్)కి ఇవ్వాలని సీసీఎస్ పోలీసులు చేసిన అభ్యర్థనను నాంపల్లి క్రిమినల్ కోర్టు తిరస్కరించింది. అదే సమయంలో ఇద్దరు జర్నలిస్టులకు కఠిన షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పుతో ఎన్టీవీ వర్గాల్లో ఉపశమనం వ్యక్తమవుతోంది. ఈ కేసు బ్యాక్‌గ్రౌండ్ ఏమిటంటే, గత జనవరి 8వ తేదీన ఎన్టీవీ ఛానెల్‌లో ప్రసారమైన ఒక వార్తా కథనం సంచలనం రేపింది. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికీ, ఒక మహిళా ఐఏఎస్ అధికారిణికీ మధ్య సంబంధం ఉందని ఆ కథనంలో ఆరోపణలు చేశారు. ఇది వ్యక్తిత్వ హననం, దుష్ప్రచారమని భావించిన పోలీసులు ఎన్టీవీ మేనేజ్‌మెంట్, జర్నలిస్టులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా జనవరి 14వ తేదీ ఉదయం సీసీఎస్ పోలీసులు చర్యలు మొదలుపెట్టారు. దొంతు రమేష్‌ హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కుటుంబ సభ్యులతో కలిసి బ్యాంకాక్ వెళ్లే సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు రిపోర్టర్లు సుధీర్, పరిపూర్ణా చారిని కూడా అరెస్ట్ చేశారు. ముగ్గురిని సీసీఎస్ కార్యాలయానికి తరలించి ప్రశ్నించారు. పరిపూర్ణా చారిని ప్రశ్నించి వదిలేశారు. మిగతా ఇద్దర్నీ వదల్లేదు. ఈ అరెస్టులపై బీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. మాజీ మంత్రి హరీశ్ రావు ఇది ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading