కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 8 (నమస్తే ఎల్లంపల్లి): ఎమ్మెల్యే కేపి వివేకానంద్ నేతృత్వంలో.. అకడెమిక్ ఎక్స్లెన్స్ మించి విద్యార్థుల ఆల్ రౌండర్ డెవలప్మెంట్ కోసం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ కేపి వివేకానంద్ గారు చేపడుతున్న ఇనిషియేటివ్స్ లో భాగంగా “5ఈ ఛాంపియన్ ప్రొఫైల్” సంస్థ భాగస్వామ్యంతో నేడు మరో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. చట్ట సభల్లోని కార్యకలాపాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించే సమొన్నత లక్ష్యంతో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ నేతృత్వంలో చట్ట సభల నిర్వహణను ప్రత్యక్షంగా వీక్షించేందుకు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు (చింతల్) భగత్ సింగ్ నగర్ జెడ్పీహెచ్ఎస్ కు చెందిన ముస్కాన్, గొట్టప్పు గునవర్ధన్, కుత్బుల్లాపూర్ జెడ్పీహెచ్ఎస్ కు చెందిన ముడవత్ సుమిత్ర, మోడేపల్లి యశ్వంత్, గురుబిల్లి హేమలతలు అసెంబ్లీని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి కావాల్సిన చట్టాలను రూపొందించడంలో శాసన సభ పాత్ర ఎంతో కీలకమైనదని అన్నారు. భావి భారత పౌరులుగా నేటి విద్యార్థులకు చట్ట సభల పట్ల అవగాహన వారి ఆల్రౌండ్ డెవెలప్మెంట్ కు దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో.. బడ్జెట్ తీరుతెన్నులు.. రకరకాల పద్దులు వాటిపై విపక్షాలు అడిగే ప్రశ్నలకు అధికార పక్షాలు ఇచ్చే సమాధానాలను విద్యార్థులు మొట్ట మొదటి సారి ఎంతో ఆసక్తిగా తిలకించారు.
ఎమ్మెల్యే చొరవ అభినందనీయం… విద్యార్థుల తల్లిదండ్రుల ప్రశంసలు
విద్యాబుద్ధులతో పాటు సామాజిక, రాజకీయ అంశాలపై తమ పిల్లల్లో అవగాహన కల్పించి వారిలోని ప్రతిభను వెలికి తీసేందుకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తీసుకుంటున్న చొరవను విద్యార్థుల తల్లిదండ్రులు మెచ్చుకున్నారు.






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.