* రూ.28 లక్షలతో సీసీ రోడ్డు అభివృద్ధి చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన సన్మాన్ బెల్మొర్ విల్లాస్ సభ్యులు
కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని సన్మాన్ బెల్మొర్ విల్లాస్ లో రూ.28 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు. తమ సమస్యను తీర్చినందుకు ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతీ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు రామ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి జీతేంద్రనాథ్, కిషోర్, సురేష్, శ్రీకాంత్, కమల్ మరియు వార్డు సభ్యులు ఇందిరా రెడ్డి, సుధాకర్ గౌడ్, సీనియర్ నాయకులు కుంట సిద్ధిరాములు, కాలే నాగేష్, గణేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.