నవతరం

తెలుగు దినపత్రిక

చల్లగుండు కబ్జామాత… నీ చక్కటి సంతకాల చేత

కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: తన చల్లని చూపులతో.. చక్కటి సంతకాలతో తమను చల్లగా చూడాలని ఇక్కడి ‘కబ్జా బ్రదర్స్’ ఆ సంతకాల తల్లిని నీవు చల్లగా ఉండు తల్లి అని కోరుకుంటున్నారంట. మొన్నటివరకు తమకు నిలువ నీడ లేదు, కనీసం సొంత ఇల్లు లేదు అని మొర పెట్టుకున్న ఆ కబ్జాల తల్లి, ప్రస్తుతం ఒక బస్తీకే కబ్జాల తల్లిగా అవతారమెత్తింది. గాజులరామారం సర్వే నంబర్ 329/1, 307 లోని ప్రభుత్వ, ఏపీఎస్ఎఫ్సీ భూముల్లోని ప్లాట్ ల అమ్మకాల నోటరీలపై ఆ తల్లి సంతకాలు పెడుతుంది, ఈ తనయులు తందనాలాడుతారంటూ స్థానిక ప్రజలు ముక్కుతో నవ్వుతున్నారు. గాలిపోచమ్మ బస్తీ మొదట ఒక్క నిర్మాణానికి నోచుకోకున్నా.. ఈ కబ్జా బ్రదర్స్ నకిలీ సంతకాలు, ఫోర్జరీ డాక్యుమెంట్ లు తయారు చేసి ప్లాట్ లు అమ్మి కొన్ని లక్షలు దండుకున్నా.. మొదట వీరికి కలిసి రాలేదంట. అంతే, కేసులకు భయపడో.. అమ్మ దీవెన ఉంటే చాలనుకున్నారో ఏమో.. ఈ కబ్జాల తల్లి పేరుతో నోటరీలు చేయటం, ఆ తల్లితో సంతకాలు పెట్టించడం ద్వారా తమకు కలిసొచ్చిందంటున్నారు ఈ కబ్జా బ్రదర్స్.. అంటున్నారు ఈ సంతకాల సంగతి తెలిసినవాళ్ళు. అందుకే అంటారు చల్లగుండు కబ్జామాత.. మమ్మల్ని చల్లగ సూడు అని.. అంతేగా.. అంతేగా..?

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading