* జీడిమెట్ల ఈఎస్ఐ ఆస్పత్రికి కేంద్రం పైసలు ఇచ్చినా డాక్టర్లను / నర్సుల ను నియమించలేని అసమర్థ బీఆర్ఎస్ ప్రభుత్వం
* డా. ఎస్ మల్లారెడ్డి, బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు
కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: షాపూర్ నగర్ లో గల ఈఎస్ఐ ఆస్పత్రి సందర్శించి రోగుల తో మాట్లాడారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు ఎస్ మల్లారెడ్డి. అనంతరం డాక్టర్లతో మాట్లాడి స్థితిగతులపై, ఆస్పత్రి అవసరాలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ రోజుకి 9 వందల నుండి 1200 మంది రోగులు వస్తారని… ప్రస్తుతానికి ఉన్న డాక్టర్లు / నర్సులు వచ్చే రోగులకు సరిపోవట్లేదు ఎన్నో సార్లు ప్రభుత్వానికి విన్నవించినా స్పందన లేదన్నారు. డాక్టర్లు, ల్యాబ్ టెక్నిషియన్లు, పార్మాసిస్టులు మొత్తం 231 మంది సిబ్బంది నియామకం కోసం జనవరిలోనే జీవో విడుదల అయినా కూడా ఒక్కరిని కూడా నియమించక పోవడం ప్రభుత్వానికి సిగ్గు చేటన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఖర్చులు భరించడానికి సిద్ధంగా ఉన్నా, కాళీలను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదని, దీనివల్ల రోగులు ఇబ్బంది పడుతున్నారన్నారు. తక్షణమే సిబ్బంది నియామకాలు చేపట్టి, జీడిమెట్ల ఈఎస్ఐ ఆస్పత్రికి పూర్తి స్థాయిలో డాక్టర్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బక్క శంకర్ రెడ్డి, చింతల్ డివిజన్ అధ్యక్షుడు పత్తి సతీష్, జీడిమెట్ల అధ్యక్షుడు పులి బలరాం, బీజేవైఎం రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ కేశవ్ యాదవ్, కృష్ణమూర్తి, సతీష్ రంగంపేట పాల్గొన్నారు.
– లింగం శ్రీకాంత్, స్పెషల్ కరస్పాండెంట్









































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.