నవతరం

తెలుగు దినపత్రిక

నేటి బాలలే రేపటి పౌరులు, భవిష్యత్ నిర్నేతలు

* ఆలివ్ స్వీట్స్ అకాడమిక్ ఎక్సలెన్సర్ అవార్డు కార్యక్రమంలో మాధవరం కృష్ణారావు

కూకట్పల్లి / హైదరాబాద్, నవతరం: విద్యార్థులు తాము చదువుకునే విద్యలో రాణించగలిగితే సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తారని కూకట్ పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. తల్లిదండ్రులు, చదువు చెప్పిన గురువులు ఎన్నటికీ మరవకూడదని సూచించారు. శనివారం కూకట్ పల్లి కేపి.హెచ్.బి కాలనీ లోని పీ ఎం ఆర్ ఎంపైర్ లో “ఆలివ్ స్వీట్స్ అకాడమిక్ ఎక్సలెన్సర్” అవార్డు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం మూసాపేట్ జిల్లా పరిషత్ హై స్కూల్ లో పదవ తరగతిలో 600 మార్కులకు గాను 579 మార్కులు సాధించి జిల్లా ఫస్ట్ ర్యాంకు తెచ్చుకున్న జనం సోనియాను అభినందించి ఆలివ్ అకాడమిక్ ఎక్స్లెన్స్ అవార్డు తరఫున లక్ష రూపాయల చెక్కును సోనియాతో పాటు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అదేవిధంగా మిగతా 12 మంది విద్యార్థులకు పదివేల చొప్పున చెక్స్ ను సంస్థ వ్యవస్థాపకుడు దొర రాజు అందజేశారు. కూకట్ పల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అండగా నిలుస్తూ పదో తరగతిలో ప్రతిభ కనబరుస్తున్న వారిని గుర్తించి ప్రతి సంవత్సరం ఇలానే నగదు బహుమతిని అందజేస్తున్నామని దొర రాజు ప్రకటించారు. గత ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉందని అన్నారు. నేడు రెండు లక్షల 20వేల రూపాయల నగదు బహుమతిని విద్యార్థులకు అందించామని అన్నారు. త్వరలో జరగబోయే పదవ తరగతి ఫలితాల్లో  ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈసారి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా మొదటి బహుమతి సాధించిన సోనియా కుటుంబ సభ్యులకు మొట్టమొదటి ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ సైతం తమ సంస్థ నుండి వారికి గిఫ్ట్ రూపేనా అందజేస్తామని తెలిపారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading