* బిసి రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్
రాష్ట్రంలో బీసిల కులగణన చేసి, పెరిగిన జనాభాకనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ, డా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: తెలంగాణ రాష్ట్రంలో బిసి వర్గాల జనాభా 50 శాతానికి పైగా,రాష్ట్ర మొత్తం జనాభాలో సగం ఉంది. కానీ రాష్ట్రం లోని విద్య, ఉద్యోగ మరియు ఇతర అన్ని రంగాల్లో బీసిల వాటా కేవలం 27 శాతం మాత్రమే ఉంది. గత 75 ఏళ్ళుగా బీసిలకుతమ వాటా అందక వెనకకు నెట్టివేయబడుతూనే ఉన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల ప్రజలకు ఎలాంటి శాస్త్రీయబద్దమైన పరిశోధనాత్మక విచారణ లేకుండానే కేవలం 8 శాతం ఉన్న వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం చట్టాన్ని తెచ్చింది. ఆ చట్టాన్ని యధావిధిగా రాష్ట్రంలో అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం 52 శాతం జనాభా ఉన్న బీసిలకు రిజర్వేషన్లు ఎందుకు పెంచడం లేదని బహుజన్ సమాజ్ పార్టీ ప్రశ్నిస్తున్నది. తమిళనాడు, జార్ఖండ్, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల ప్రభుత్వాల వలె తెలంగాణ ప్రభుత్వం కూడా పెరిగిన జనాభాకు అనుగుణంగా అన్ని వర్గాలకు రిజర్వేషన్లు పెంచాలని బీఎస్పి డిమాండ్ చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ గత ఎనిమిదేళ్ళుగా బీసిలను మోసం చేస్తూనే ఉంది. బీసి కార్పొరేషన్, బీసి ఫెడరేషన్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి కాగితాలకే పరిమితం చేసింది. రాష్ట్ర మొత్తం బడెట్లో 50శాతానికి పైగా ఉన్న జనాభాకు లక్ష కోట్లు కేటాయించవలసిన చోట, కేవలం 3 శాతం బడెట్, 6 వేల కోట్లు మాత్రమే కేటాయించి దారుణంగా అన్యాయం చేసింది. ఎంబీసి కార్పోరేషన్లు ఏర్పాటు చేసి, అరకొర నిధులు ఇస్తూ, బీసి ఫెడరేషన్లకు బోర్డులు కూడా ఏర్పాటుచేయకుండా ఉద్దేశ్యపూర్వకంగానే బీసిల అభివృద్ధిని ప్రభుత్వం అడ్డుకుంటుంది. బీసిలకు ఆత్మగౌరవ భవనాలను కట్టిస్తామని చెప్పి హైదరాబాద్ నగరానికి వెలుపల స్థలాలు కేటాయించి, అక్కడ ఇప్పటివరకు పనులు కూడా ప్రారంభించకుండా బీసిల పట్ల నిర్లక్ష్యం చూపడాన్ని బీఎస్పి ఖండిస్తున్నది. బీసిలను కేవలం ఓటు వేసే యంత్రాలుగా మాత్రమే చూడడం మానుకోవాలని హెచ్చరిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలోని బీసిల సమస్యలను వెంటనే పరిష్కరించలేని పక్షంలో ప్రభుత్వం వెంటనే రాజీనామా చేసి గద్దె దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నది.
బీఎస్పి డిమాండ్స్
1. బీసిలను కులాల వారీగా జనగణన చేయాలి.
2. బీసి రిజర్వేషన్లు 27 శాతం నుండి 50 శాతానికి పెంచాలి.
3. పెరిగిన జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీ ,మైనారిటీల రిజర్వేషన్లు కూడా పెంచాలి.
4. రాష్ట్ర బడెట్లో 50 శాతం నిధులను బీసిలకు కేటాయించాలి.
5. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించాలి.
6. సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టును ప్రజలందరికీ బహిర్గతపరచాలని డిమాండ్ చేశారు.






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.