నవతరం

తెలుగు దినపత్రిక

బూత్ కమిటీ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం

* జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తో బూత్ కమిటీల సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం

* మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: నిజాంపేట్ కార్పొరేషన్, దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీ ల బీజేపీ శక్తి కేంద్రాల ఇంచార్జుల సమావేశం బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బుచ్చి రెడ్డి, జాయింట్ కన్వీనర్ రాము గౌడ్ ల ఆధ్వర్యంలో గండిమైసమ్మ లోని శ్రీ సాయి బాలాజీ ఫంక్షన్ హల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, అసెంబ్లీ పాలక్ డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నెల 7న జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తో జరగనున్న బూత్ కమిటీల సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ, బూత్ కమిటీ లను పూర్తిచేసి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలనీ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపి పార్లమెంట్ కన్వీనర్ ఆర్కే శ్రీనివాస్, కోకన్వీనర్ ఎమ్మారేస్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి విగ్నేశ్వర్, నాయకులు రాజి రెడ్డి, దాసరి శ్యామ్ రావ్, ఆకుల సతీష్, మల్లేష్ యాదవ్, జనార్దన్ రెడ్డి, కౌన్సిలర్లు, జిల్లా పదాధికారులు, వివిధ మోర్చాల నాయకులు, మున్సిపల్ పదాధికారులు, శక్తి కేంద్ర ఇంచార్జులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading