నవతరం

తెలుగు దినపత్రిక

ఏ కష్టమొచ్చినా అండగా ఉంటాం

చిరువ్యాపారులకు ఏకష్టమొచ్చినా అండగా ఉంటాం

• సిపిఐ నాయకులు

కొత్తగూడెం, నమస్తే ఎల్లంపల్లి: పేదలకు, చిరు వ్యాపారుల ఏకష్టమొచ్చిన సిపిఐ అండగా ఉంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. కొత్తగూడెం పట్టణంలోని వివాదాస్పద కూరగాయల మార్కెట్ ప్రాంగణాన్ని బుధవారం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె. సాబీర్ పాషాతో కలిసి సందర్శించారు. వ్యాపారులను కలిసి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం మార్కెట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి పేరుతో పేదల బ్రతకులను విద్వంసం చేయడం సరైందికాదన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని స్వాగతిస్తున్నామని, ఐతే నిధులు మంజూరైనప్పటికి నిర్మాణాలు చేపట్టకుండా నెలలతరబడి ఎందుకు జాప్యం చేస్తున్నారన్నారు. వ్యాపారులు ఎవరూ మార్కెట్ అభివృద్ధిని అడ్డుకోబోరని, ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా అర్ధరాత్రివేల కూల్చివేతలకు పాల్పడటం ఎంటని ప్రశ్నించారు. కూల్చివేతలకు నిరసనగా సిపిఐ నిర్వహించిన పోరాట ఫలితంగానే అధికార యంత్రాంగం కదిలివచ్చి నిర్మాణాలకు శంకుస్థాపన చేశారని, కార్మికులు, కర్షకులు, పేదలు పోరాటబాటపడితే ఎంతటివారైనా దిగిరాక తప్పదని స్పష్టమైందన్నారు. అన్ని సౌకర్యాలతో మార్కెట్ నిర్మాణం చేపట్టాలని, త్వరితగతిన మార్కెట్ నిర్మాణాన్ని పూర్తి చేసి వ్యాపారులకు, ప్రజలకు అందుబాటులోకి తేవాలని నిర్లక్ష్యం చేస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కూనంనేని వెంట సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వై. శ్రీనివాసరెడ్డి, జిల్లా సమితి సభ్యులు కంచర్ల జమలయ్య, గెద్దాడు నగేష్, భూక్యా శ్రీనివాస్, కౌన్సిలర్ బోయిన విజయకుమార్, వ్యాపారులు లక్ష్మి నర్సింహారావు, రహమాన్, సజ్జు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading