అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కూకట్ పల్లి, నమస్తే ఎల్లంపల్లి: అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ అని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం తన క్యాంప్ కార్యాలయంలో 80 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకవైపు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే కాకుండా నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టారని అన్నారు. ఇప్పటికే కూకట్పల్లి నియోజకవర్గంలో 15వేల మందికి పైగా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు. నిరుపేద ఆడబిడ్డకు పెళ్లి చేసిన తర్వాత తల్లిదండ్రులకు ఈ పథకం ద్వారా వచ్చే 1లక్ష 116 వేల రూపాయలు ఎంతో ఉపయోగకరంగా నిరుపేదల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి మన కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముద్దం నరసింహ యాదవ్, ఆవుల రవీందర్ రెడ్డి, మహేశ్వరి శ్రీహరి, పండాల సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.