నవతరం

తెలుగు దినపత్రిక

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన నీలం మధు ముదిరాజ్

* చిట్కుల్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్

పటాన్చెరు, నమస్తే ఎల్లంపల్లి: రాష్ట్రమంతటా ప్రజల కళ్ళతో పాటు వారి జీవితాల్లో వెలుగులు నింపాలని ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు హరీష్ రావు కంటి వెలుగు కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు చిట్కుల్ గ్రామ పరిధిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని నీలం మధు ముదిరాజ్ ప్రారంభించారు. మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో మధ్యతరగతి వర్గాలకు ఈ కంటి వెలుగు కార్యక్రమం ఎంతో ఉపయోగపడనుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు. ప్రజల సంక్షేమమే కాంక్షిస్తూ రాష్ట్రాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలక మలుపు తీసుకున్నారని ఆయన తెలిపారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం దిశగా దూసుకెళుతుందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా ఆయన వెంటే ఉంటారని ఆయన తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా కూడా అమలు చేసేలా చూస్తారని ఆయన చెప్పారు దీంతో ప్రతీ ఒక్కరూ కెసిఆర్ ని ఆశీర్వదిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈవో కవిత, ఎంపిటిసిలు మాధవి, మంజుల, వార్డు సభ్యులు గౌరి,మురళీ, వెంకటేశ్, రాజ్ కుమార్, డాక్టర్లు, ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading