* బడ్జెట్ లో 50 శాతం బిసిలకు కేటాయించాలి
* రామప్పను కెసిఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు
డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ.
చొప్పదండి / కరీంనగర్, నమస్తే ఎల్లంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్ లో 50 శాతం నిధులు బిసిల అభివృద్ధి కోసం కేటాయించాలని,బిసి సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. అదేవిధంగా బీహార్ రాష్ట్రంలో చేసినట్లు బిసి కులగణన జరిపి జనాభా ప్రాతిపదికన తమిళనాడు,చత్తీస్ ఘడ్,జార్ఖండ్,కర్ణాటక రాష్ట్రాల వలే బిసి రిజర్వేషన్లను పెంచాలన్నారు. బండి సంజయ్ కేంద్రంతో కొట్లాడి బిసి రిజర్వేషన్ల పెంపు గురించి మాట్లాడిన తర్వాతనే ఓట్ల కోసం రావాలని డిమాండ్ చేశారు. 300ల రోజుల బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా నేడు 172వ రోజు చొప్పదండి మండలంలో పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ… 317 జివో వల్ల ఇబ్బందులు పడుతున్న టీచర్ల సమస్యలు తీర్చకుండానే, ఎన్నికల కోసం హఠాత్తుగా టీచర్ల బదిలీలు చేపడుతున్నారని విమర్శించారు. ముందుగా 317 జివో వల్ల నష్టపోయిన వారికి, స్పౌజ్ బదిలీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడానికి బిఆర్ఎస్ ప్రభుత్వ కృషి ఉందన్న ఎమ్మెల్సి కవిత వ్యాఖ్యలను ఖండించారు. ప్రభుత్వం రామప్ప అభివృద్ధికి ఎన్ని కోట్లు విడుదల చేసిందో లెక్కలు చూపాలన్నారు. యాదాద్రి,భద్రాద్రికి కేటాయించినన్ని నిధులు రామప్ప, రాజరాజేశ్వర దేవాలయం, కీసర గుట్ట, ఐనవోలు మల్లికార్జున దేవాలయం, కొమురవెల్లి మల్లన్న దేవాలయాలను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం శైవదేవాలయాలను, గ్రామ దేవతలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
తెలంగాణ ప్రభుత్వం 3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతామని చెబుతుందని, కానీ ప్రభుత్వ రాబడి గురించి మాత్రం చెప్పడం లేదని విమర్శించారు.కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం మాత్రమే ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు. దళిత బంధు కోసం 17.7 వేల కోట్లు కేటాయించి, విడుదల చేయకుండా, డబుల్ బెడ్ రూం ఇళ్లు పూర్తి చేయకుండా తిరిగి బడ్జెట్ లో ఆ పథకాల కోసం నిధులు కేటాయించడమేంటని ప్రశ్నించారు. ఇవన్నీ ఓట్ల కోసమే చేస్తున్నారని ఆరోపించారు.
ప్రగతి భవన్ లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంపై ఆయన మండిపడ్డారు. ప్రగతిభవన్ కోసం చేసే ఖర్చులో ప్రతి పైసా పేదలదేనన్నారు. పేదల సొమ్ముతో పార్టీ కార్యకలాపాలు చేయడాన్ని ఖండించారు. తెలంగాణ భవన్ లేదా ఫాంహౌస్ పార్టీ కార్యకలాపాలు జరుపుకోవాలని సూచించారు.
కెసిఆర్ టిఆర్ఎస్ ఉద్యమపార్టీ అని చెబుతూ 2014 నుండి ప్రాజెక్టుల కాంట్రాక్టులన్ని ఆంధ్రోళ్లకే కట్టబెట్టారని, 1300 మంది అమరుల త్యాగాలను మోసం చేశారని పేర్కొన్నారు. కేసిఆర్ కు తెలంగాణలో బతికే అర్హత లేదంటూ విమర్శించారు.

యాత్రలో భాగంగా నేడు రుక్మాపూర్ లోని సైనిక్ స్కూల్ ను సందర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడిన సైనిక్ స్కూల్ నేడు నిరాధరణకు గురవుతుందన్నారు. బోదనా సిబ్బంది, వసతులు, బడ్జెట్ కేటాయించింది వివక్ష చూపుతుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదనతో ఉన్నారని, ఈ పాఠశాల అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు చొరవ చూపాలని,లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనేక గ్రామాల్లో ఉన్న పేదల భూములను ప్రభుత్వం కాలువలు, ప్రకృతివనం, స్మశానవాటికల పేరుతో ఆక్రమిస్తుందని తెలిపారు. భూనిర్వాసితులైన వారికి కూడా పేదల భూములను కేటాయిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ భూములను పేదలకు పంచివ్వాలని డిమాండ్ చేశారు.
యాత్ర రుక్మాపూర్, కాట్నపల్లి చొప్పదండి గ్రామాల్లో కొనసాగింది. ఇంకా రాగంపేట, అర్నకొండ,వెదురుగట్ట గ్రామాల్లో పర్యటించనున్నారు. యాత్రలో జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్, జిల్లా ఇంచార్జి నల్లాల రాజేందర్, నియోజకవర్గ ఇంచార్జి కొంకటి శేఖర్, మంద రవీందర్, నియోజకవర్గ అధ్యక్షులు మహంకాలి. తిరుపతి, మహిళా జోనల్ కన్వీనర్ స్వరూప, నియోజకవర్గ మహిళ నాయకురాలు అనూష, స్వప్న తదితరులు పాల్గొన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.