నవతరం

తెలుగు దినపత్రిక

మత్స్యకారులను ఇబ్బంది పెడితే ప్రభుత్వం నడవదు

మెదక్, నమస్తే ఎల్లంపల్లి: మత్స్యకారులను ఇబ్బంది పెడితే ప్రభుత్వం నడవదు అని హెచ్చరిస్తున్నా, తెలంగాణలో మా ఐక్యత, శక్తి కెసిఆర్ కి తెలుసు. ఈ గడ్డమీద ఎవరికి కష్టం వచ్చినా అక్కడ ఈటల రాజేందర్ ఉంటారు. అవసరమయితే ప్రాణాలు ఇస్తాం తప్ప వెనుకకు పోయే ప్రసక్తే లేని జాతి మాది. ధర్మం వైపు ఉండే జాతి అన్నారు ఈటల రాజేందర్. చేగుంటలో జరిగిన ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో కేంద్రమంత్రి పరుషోత్తం రూపాల, రఘునందన్ రావు తో కలిసి పాల్గొన్న ఈటల రాజేందర్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…

తెలంగాణ రాష్ట్రంలో ఓ.బి.సిలలో మత్స్యకారులు జనాభా నంబర్ వన్ స్థానంలో ఉంది. 45 లక్షల ఓటర్లు ఉన్నారు. 3.71 కోట్లు జనాభా ఉంది.
ముదిరాజ్, గంగపుత్ర, బెస్త ముగ్గురు మత్స్యకారులుగా ఉన్నారు.
వీరికి 3500 సొసైటీలు ఉన్నాయి. ఈ సొసైటీలలో మెంబర్షిప్ ఇవ్వడానికి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంది. 4000 మందికి మానెరు డాంలో మెంబర్ షిప్ ఇవ్వొచ్చు కానీ ఫ్లోటింగ్ సోలార్ ఎనర్జీ కోసమని మత్స్యకారులకు ఇబ్బందులు పెడుతున్నారు.

మత్స్యకారులను ఇబ్బంది పెడితే ప్రభుత్వం నడవదు అని హెచ్చరిస్తున్నా.
తెలంగాణలో మా ఐక్యత, శక్తి కెసిఆర్ కి తెలుసు.
ఆయన నియోజకవర్గంలోనే 45 వేల ఓట్లు ఉన్నాయి అని మర్చిపోవద్దు.

గొల్లకురుమలకు ఎలా మెంబర్షిప్ ఇచ్చారో మత్స్యకారులకు కూడా మెంబర్షిప్ ఇవ్వాలి.
ప్రాజెక్టులలో మునిగిపోయిన గ్రామాల వారికి ఖచ్చితంగా మెంబర్షిప్ ఇవ్వాలి.
జనాభా ఎక్కువ ఉండి.. వాటర్ స్ప్రెడ్ ఏరియా తక్కువ ఉన్న ప్రాంతాల్లో కడుతున్న పెద్ద ప్రాజెక్ట్స్, కాలువల్లో మెంబర్ షిప్ ఇవ్వాలి.
మిడ్ మానేరు, LMD, రంగనాయక సాగర్ లలో మెంబర్షిప్ ఇవ్వాలి అనే జ్ఞానం కెసిఆర్ కు లేదు.
మా వాళ్ళు అమాయకులు కావచ్చు కానీ పొట్టమీద కొట్టే ప్రయత్నం చేస్తే ఖర్బర్ధార్ అని హెచ్చరిస్తున్నా.

సోలార్ పవర్ గుట్టల మీద, బీడు భూముల మీద, కాలువల మీద పెట్టుకో కానీ మత్స్యకారులకు నష్టం చేయవద్దు.

మత్స్యకారులకు చేప పిల్లలు బ్రోకర్ల పాలు అవుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు నేరుగా మత్స్యకారులకు ఇవ్వాలి, వారే చేప పిల్లలు కొనక్కొచ్చుకుంటున్నారు. బ్రోకర్లు తక్కువ సంఖ్యలో, తక్కువ నాణ్యత ఉన్న చేపపిల్లలు ఇస్తున్నారు.

మత్స్యకారులను తెలంగాణలో బీసీ-డీ లో చేర్చారు. కానీ వారు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు. గుజరాత్ లో మోడీ గారు మంచి అవకాశాలు ఇచ్చారు. వారిని గుర్తించి కేంద్రంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ ను ఏర్పాటు చేశారు.

చెరువుల మీద అందులో ఉన్న చేపల మీద.. ప్రాజెక్ట్స్ లో నీళ్ళ మీద సంపూర్ణ హక్కు మత్స్యకారులకే ఉండాలి అని డిమాండ్ చేస్తున్న.

మత్స్యకారులకు ప్రమాద భీమా అందించాలి.

అడుక్కుంట్ హక్కులు రావు.. కొట్లాడితే వస్తాయి.

ఈ గడ్డమీద ఎవరికి కష్టం వచ్చినా అక్కడ ఈటల రాజేందర్ ఉంటారు.
అవసరమయితే ప్రాణాలు ఇస్తాం తప్ప వెనుకకు పోయే ప్రసక్తే లేని జాతిమనది. ధర్మం వైపు ఉండే జాతి.

ఐక్యంగా ఉందాం.. సమస్యలు పరిష్కారం చేసుకుందాం.

ఇక్కడ అన్నీ మంచినీళ్ళ చేపలు, మంచి రుచి ఉంటాయి.
తెలంగాణలో గొప్ప మత్స్య సంపద పెంచవచ్చు.

కేంద్రం చేయగలిగిన అన్ని పనులు రూపాల సహకారంతో చేయిస్తాం అని ఈటల రాజేందర్ అన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading