నవతరం

తెలుగు దినపత్రిక

నాయ‌కుల విలేక‌రుల బంధం వీడ‌దీయ‌రానిది

మేడిప‌ల్లి ప్రెస్ క్ల‌బ్ డైరీ ఆవిష్క‌ర‌ణ‌లో మంత్రి మ‌ల్లారెడ్డి వెల్ల‌డి

విలేక‌రుల‌ను మంత్రి దూరం పెడుతున్నారన్న జ‌ర్న‌లిస్టు సంఘం అధ్య‌క్షుడు గ‌డ్డ‌మీది బాల‌రాజు

మేడ్చల్ జిల్లా బ్యూరో, నమస్తే ఎల్లంపల్లి: రాజ‌కీయ నాయ‌కుల‌కు, విలేక‌రులు ఒక‌రిని విడిచి మ‌రొక‌రు ఉండ‌ర‌ని, వీరిబంధం భార్య‌భ‌ర్త‌ల్లా ఉంటుంద‌ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం మేడిప‌ల్లి ప్రెస్‌క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో రూపొందించిన నూత‌న‌సంవ‌త్స‌ర డైరీ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం చెంగిచెర్ల‌లోని జిజి గార్డెన్స్‌లో నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన మంత్రి డైరీని ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ జిల్లాలోని జ‌ర్న‌లిస్టుల‌కు అన్ని విధాలుగా ఉంటామ‌ని తెలిపారు. ఖ‌మ్మం జిల్లా జ‌ర్న‌లిస్టుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇళ్ళ స్థ‌లాల కోసం జీవోను జారీ చేసిన విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ తాను కూడా జిల్లాలో జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ళ స్థ‌లాల‌ను కేటాయించేలా కృషి చేస్తాన‌న్నారు. జిల్లాలో జ‌ర్న‌లిస్టులు స‌మిష్టిగా త‌న వ‌ద్ద‌కు వ‌చ్చి స‌మ‌స్య ప‌రిష్కారం కోసం చిత్తశుద్ధితో ప‌నిచేయాల‌ని సూచించారు. ఆరోగ్య భ‌ద్ర‌త విష‌యంలో ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ప‌నిచేస్తుంద‌ని తెలిపారు. జిల్లాలోని జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌కు త‌మ‌కు చెందిన ఆస్ప‌త్రుల‌లో ఆరోగ్య కార్డుల‌ను అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నాన‌న్నారు. తెలంగాణ రాష్ట్ర వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టుల సంఘం మేడ్చ‌ల్ జిల్లా అధ్య‌క్షుడు గ‌డ్డ‌మీది బాల‌రాజు మాట్లాడుతూ జ‌ర్న‌లిస్టుల‌ను మంత్రి ఎందుకో దూరంగా పెటుతున్నార‌న్నారు. మీరు ఏ విధంగానైతే ఓప‌న్‌గా మాట్లాడుతారో నేను ఓపెన్‌గా మాట్లాడుతాన‌ని జిల్లాలో జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల‌పై మంత్రికి చిత్త‌శుద్ధి లేద‌న్నారు. రంగారెడ్డి జిల్లా ఇంచార్జి మంత్రిగా స‌బితాఇంద్రారెడ్డి నాడు ఉమ్మ‌డి జిల్లాలో జ‌ర్న‌లిస్టుల సంక్షేమం కోసం ఎంత‌గానో ప‌నిచేశార‌ని గుర్తు చేశారు. 2008లో జ‌ర్న‌లిస్టుల‌కు ప‌ట్టాల‌ను ఇప్పంచ‌డ‌మే కాకుండా ఇప్ప‌టి కూడా జ‌ర్న‌లిస్టుల‌కు ఎలాంటి స‌మ‌స్య వ‌చ్చిన ముందుండి ప‌నిచేస్తుంద‌ని వేదిక‌పై కొనియాడారు. ఉమ్మ‌డి జిల్లా జ‌ర్న‌లిస్టుల‌కు ప్రమాద భీమా సౌక‌ర్యం క‌ల్పించిన ఘ‌న‌త ఆమెకే ద‌క్కుతుంద‌న్నారు. మంత్రి మ‌ల్లారెడ్డి కూడా జిల్లా జ‌ర్న‌లిస్టుల కోసం ఆ విధంగా ప‌నిచేయాల‌ని సూచించారు. ఫిర్జాదిగూడ మేయ‌ర్ జ‌క్క వెంక‌ట్‌రెడ్డి మాట్లాడుతూ ప్రెస్ క్ల‌బ్ నిర్మాణానికి బౌద్ద‌న‌గ‌ర్‌లో క‌మ్యూనిటీ హాల్‌ను కేటాయిస్తానని ప్ర‌క‌టించారు. భ‌వ‌న నిర్మాణానికి గ్రంథాల‌యం శాఖ నుంచి నిధుల‌ను కేటాయించాల‌ని మంత్రి ద్వారా జిల్లా గ్రంథాల‌య శాఖ చైర్మెన్ ద‌యాక‌ర్‌రెడ్డికి విజ్ఞ‌ప్తి చేశారు. ఇందుకు స్పందించిన ద‌యాక‌ర్‌రెడ్డి భ‌వ‌న నిర్మాణానికి కోటి రూపాయాల‌ను కేటాయిస్తామ‌ని హామీ ఇచ్చారు. మేడిప‌ల్లి ప్రెస్‌క్ల‌బ్ అధ్య‌క్షుడు ముర‌ళి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కార్య‌క్ర‌మంలో టియూడ‌బ్ల్యుజే రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు మోతె వెంక‌ట్‌రెడ్డి, జిల్లా కార్య‌ద‌ర్శి వెంక‌ట్రామిరెడ్డి, మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గ కార్య‌ద‌ర్శి గ‌ణేష్‌, మేడిప‌ల్లి ప్రెస్‌క్ల‌బ్ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి ఎల్ల‌య్య‌, మేడిప‌ల్లి కార్పొరేష‌న్ మేయ‌ర్‌, డిప్యూటి మేయ‌ర్‌, టిఆర్ ఎస్ మేడిప‌ల్లి అధ్య‌క్షుడు సంజీవరెడ్డి వివిధ పార్టీల నాయ‌కులు, కార్పొరేట‌ర్‌లు, జ‌ర్న‌లిస్టులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading