మేడ్చల్ జిల్లా బ్యూరో, నమస్తే ఎల్లంపల్లి: మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ను గాజులరామారం నల్లగుట్టపై గల శ్రీభ్రమరాంభ మల్లికార్జున స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు శంభీపూర్ లోని కార్యాలయంలో కలిశారు. ఈనెల 5వ తేదీన ఆలయ ప్రాంగణంలో జరిగే ద్వాదశ జ్యోతిర్లింగ శివ మహా పడిపూజకు రావాలని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త దూదిమెట్ల సోమేశ్ యాదవ్, శివ స్వాములు ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, సురేష్ రెడ్డి, నాయకులు ఎత్తరి మారయ్య, కృష్ణా యాదవ్, శివ స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.