నవతరం

తెలుగు దినపత్రిక

రాజకీయ ఖైదీల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి

  • ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న ప్రజా సంఘాల నేతలు

Breaking News: గత ఆరు రోజులుగా హైదరాబాద్ చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మహారాష్ట్రకు చెందిన  మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, రాజకీయ ఖైదీ సంజయ్ దీపక్ రావును చర్లపల్లి కేంద్ర కారాగారం నుండి చంచల్ గూడ సెంట్రల్ జైలుకు తరలించిన జైలు అధికారులు, ఆరోగ్యం క్షీణించిందని ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేయడానికి జైళ్ళ శాఖ అధికారులు కుట్రలు పన్నుతున్నారని అతనికి ఏమైనా ప్రాణహాని జరిగితే తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలని రాజకీయ ఖైదీల విడుదల కమిటీ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్, నేతలు…

తక్షణమే మానవహక్కుల కమిషన్ జోక్యం కల్పించుకుని సంజయ్ దీపక్ రావుకు నిమ్స్ ఆసుపత్రిలో వైద్యం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

రాజకీయ ఖైదీల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని లేనిచో ప్రజా సంఘాల నేతృత్వంలో ప్రజా ఉద్యమాలను విస్తృత పరుస్తామని ప్రజాసంఘాల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

దిగజారిన మావోయిస్ట్ రాజకీయ ఖైదీ సంజయ్ దీపక్ రావు ఆరోగ్యం – తక్షణ వైద్య సహాయం అందించాలి

మావోయిస్ట్ రాజకీయ ఖైదీ సంజయ్ దీపక్ రావు నిరాహార దీక్ష ఆరు రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నదని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ (IAPL) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

వయసు దాదాపు 60 సంవత్సరాలు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు జైలు అధికారులు ఆయనను నిమ్స్ ఆసుపత్రికి తరలించకపోవడం అమానవీయతకు నిదర్శనం. ఇది జైలు అధికారుల కక్ష సాధింపు ధోరణిని ప్రతిబింబిస్తోంది.

సంజయ్ దీపక్ రావు చేసిన డిమాండ్ పూర్తిగా చట్టబద్ధమైనది — ఖైదీలకు పగటిపూట బ్లాక్‌లలో స్వేచ్ఛగా తిరిగే హక్కు తెలంగాణ జైలు మాన్యువల్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద హామీ ఇవ్వబడింది. ఈ హక్కును నిర్లక్ష్యం చేయడం చట్ట విరుద్ధం.

IAPL డిమాండ్లు:
1. సంజయ్ దీపక్ రావును తక్షణమే నిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్ష చేయాలి.
2. వృద్ధ ఖైదీ ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నందుకు జైలు అధికారుల పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.
3. చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై న్యాయ విచారణ జరిపించాలి.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను తక్షణ చర్యలు తీసుకోవాలని IAPL విజ్ఞప్తి చేస్తోంది.

ఎం. వెంకన్న, ఉపాధ్యక్షుడు
డి. సురేష్ కుమార్, జాయింట్ సెక్రటరీ
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ (IAPL)

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading