నవతరం

తెలుగు దినపత్రిక

సయ్యద్ నగర్ లో పర్యటించిన ఎమ్మెల్యే

* పేట్ బషీరాబాద్ సయ్యద్ నగర్ లో ఎమ్మెల్యే పర్యటన

కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని పేట్ బషీరాబాద్ సయ్యద్ నగర్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్థానిక సమస్యలపై పర్యటించారు. ఈ మేరకు భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి ద్వీపాలు, 58 జీవో ద్వారా పట్టాలు అందించాలని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా.. ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఇందిరా రెడ్డి, సుధాకర్ గౌడ్, సీనియర్ నాయకులు కుంట సిద్ధిరాములు, కాలే నాగేష్, గణేష్, అనీల్, స్థానికులు కమలాకర్, యాసిం పాష, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading