నవతరం

తెలుగు దినపత్రిక

విన్నీ భాయ్ కిచెన్ ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్

కూకట్పల్లి: “విన్నీ భాయ్” కిచెన్ ను ప్రారంభించిన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్. ఈరోజు కూకట్ పల్లి అల్విన్ కాలనీ ఫేజ్ – 1 చౌరస్తాలో ఈశ్వరి, భాస్కర్ ల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన “విన్నీ భాయ్” కిచెన్ ను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వినూత్న రుచులను వినియోగదారులకు అందిస్తూ “విన్నీ భాయ్” కిచెన్ దినదినాభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బూర్గుబావి హన్మంత్ రావు, నాయకులు జైహింద్, బాబు గౌడ్, మహేందర్, విఘ్నేష్, శంకర్, శేఖర్, అల్లావుద్దీన్, విద్యా సాగర్, పాస్టర్లు జెర్మియా, క్రిస్టోఫర్, రాంకోటి నాయక్,  సుమిత్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading