నవతరం

తెలుగు దినపత్రిక

120 కోట్ల విద్యుత్ ఖర్చు ఆదా…!

హైదరాబాద్, నవతరం: మున్నేరు పాలేరు గ్రావిటీ లింక్ పధకంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… 50 టి.యం.సి ల నీటితో మున్నేరు-పాలేరు గ్రావిటీ లింక్ 162.57 కోట్ల కేటాయింపు జరుగుతుంది. ఖమ్మం, సూర్యాపేట, మహాబూబా బాద్ జిల్లాలో 1.38 లక్షల ఎకరాలకు నీటి స్థిరీకరణ అవుతుంది. పాలేరు రిజర్వార్ ఎగువ భాగంలో 40 వేల ఎకరాల ఎన్.ఎస్.పి ఆయకట్టుకు భరోసా అవుతుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ స్టేజ్ -2 ఆయాకట్టుకు ఆదనపు ప్రయోజనం ఉంటుంది. భక్త రామదాసు ఎత్తిపోతల పధకం డి.బి.యం-60 ద్వారా 76,308 ఎకరాల ఆయకట్టుకు అదనపు నీరు, సూర్యాపేట జిల్లా మోతే ఎత్తిపోతల పధకం కింద 46,712 ఏకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీరు ఉంది. ప్రాజెక్టు పూర్తి అయితే సాలీనా ప్రభుత్వానికి 120 కోట్ల విద్యుత్ ఖర్చులు ఆదా అవుతుంది. అదనపు నీటితో పాలేరు రిజర్వాయర్ హైడల్ ప్లాంట్ లో 2 మేఘావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆస్కారం ఉంది, ఆకస్మిక వరదలతో జరిగే నష్టాలకు చెక్ పెట్టవచ్చు అన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading