నవతరం

తెలుగు దినపత్రిక

మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈటల రాజేందర్

జనగామ జిల్లా, నమస్తే ఎల్లంపల్లి: లింగాల ఘనపూర్ లో ప్రధాన మంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల రాజేందర్. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ… ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే వ్యవస్థలో మార్పులు తీసుకురాగలం అని బలంగా నమ్మిన వ్యక్తి మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అందుకే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా అనేక అంశాలను ప్రజలముందు ఉంచుతున్నారు. గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయం అభివృద్దిలోనే దేశాభివృద్ధి ఉంది అని బలంగా నమ్మిన వ్యక్తి. ఒకప్పుడు మన దేశంలో సంప్రదాయ రీతిలో, ఆర్గానిక్ వ్యవసాయం ఉండేది. కానీ ఇప్పుడు రసాయనాల వాడకం విపరీతంగా పెరిగింది. దీంతో జబ్బుల బారిన పడేవారు పెరిగారు. ఒకప్పుడు గ్రామాల్లో కష్టం చేసుకొనే వారికి జబ్బులు వచ్చేవి కావు. ఇప్పుడు వారికి కూడా జబ్బులు వస్తున్నాయి. లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. మూత్రం పోయడానికి కూడా మోటార్ సైకిల్ వేసుకుని వెళ్ళే రోజులు వచ్చాయి. శ్రమ తగ్గింది. ఆయుర్వేదం యునాని ప్రాచీన వైద్య పద్ధతుల వినియోగం, ప్రాచీన వ్యవసాయ పద్దతులు పెరగాలని ప్రధాన మంత్రి సూచన వాటిని పాటించే ప్రయత్నం చేద్దాం. ఆరోగ్యంగా ఉందాం.మన్ కీ బాత్ మార్పు కి నాంది పలుకుతుంది అని.. భారతదేశాన్ని విశ్వ గురువుగా చేయడంలో తోడ్పాటు అందిస్తుంది అని భావిస్తున్నానని ఈటల రాజేందర్ అన్నారు.

అటల్బిహారీ వాజపేయి గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఈటల రాజేందర్.తెలంగాణను అప్పుల కుప్పగా మర్చి, తాగుడులో, దోపిడీలో, ప్రజలకు మాయమాటలు చెప్పడంలో కెసిఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని ఈటల రాజేందర్ అన్నారు. ప్రజలను కలవకపోవడంలో నంబర్ వన్ గా తెలంగాణ మారిందని అన్నారు. తెలంగాణలోని ప్రతి మనిషి మీద లక్ష అప్పు ఉందని టీఆరెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేసారు హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. జనగామ జిల్లా లింగలఘనపూర్ మండలకేంద్రంలో అటల్ బిహారీ వాజపేయి జయంతి సందర్భంగా బీజేపీ జిల్లా, గ్రామ స్థాయి నాయకులతో కలిసి వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించి, విగ్రహానికి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా తీర్చిదిద్దరని, గ్రామాల్లో సర్వే చేస్తే తాగడం తిండిలా సాధారణం అయ్యిందని అన్నారు. భర్త తాగి మరణిస్తే వితంతువు ఫించన్ ఇస్తున్నాడే తప్ప ఆ కుటుంబానికి భరోసా లేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాశయజెండా రెపరేపలాడనుందని అన్నారు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading