* అధిక పన్నులతో బేంబెలిస్తున్న ఫిర్జాదిగూడ కార్పొరేషన్
* పార్కు స్థలాలు అక్రమ నిర్మాణాలపై చర్యలు శూన్యం
* బీఎస్పీ అధ్యక్షుడు అంబేద్కర్
మేడిపల్లి, నమస్తే ఎల్లంపల్లి: అధిక టాక్స్ లతో ప్రజలపై భారం పడుతుందని పీర్జాదిగూడా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి కి బీఎస్పీ అధ్యక్షులు ఇటికాల అంబేద్కర్ ప్రజా సమస్యలపై బహిరంగ లేఖ రాశారు. వివరాల్లోకి పీర్జాదిగూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాలి స్థలాలు ఇళ్ల ట్యాక్స్ పెంచడం పై బహుజన్ సమాజ్ పార్టీ తరుపున తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నామని, తక్షణమే పెంచిన ట్యాక్స్ లను వసూలు చేయడం ఆపాలని మధ్యతరగతి ప్రజలకు భారం కాకుండా ట్యాక్స్ వాసులు చేయాలనీ ఈ సందర్బంగా డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో ప్రజలతో కలిసి కార్పొరేషన్ ను ముట్టడిస్తామనితెలిపారు.. దేశంలో ఎక్కడా లేని విధంగా పీర్జాదిగూడ కార్పొరేషన్ లో టాక్స్ వసూలు చేస్తున్నారని, టాక్స్ అధిక శాతం పెంచి ప్రజలను ఆర్థిక ఇబ్బందులు గురిచేస్తున్నారని, పేద మధ్యతరగతి ప్రజలు అధికంగా ఉండే కార్పొరేషన్ లో ఈ విదంగా ఇస్టమొచ్చినట్టు నిబంధనలకు తూట్లు పొడుస్తూ పన్నుల రూపంలో ట్యాక్స్ వసూలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ప్రజల తరుపున బహుజన్ సమాజ్ పార్టీ నిలబడి పెంచిన ట్యాక్స్ లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలియజేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో అనుభవం లేని కమిషనర్ ని కీలుబొమ్మ చేసి మీరు ఆడిందే ఆట పాడిందే పాటలాగా చేస్తే ఊరుకునే ప్రసక్తేలేదు. ఇప్పటికైనా ప్రజల ఇబ్బందులు దృష్ట్యా పాత పద్దతిలో ట్యాక్స్ వసూలు చేయాలనీ పెంచిన ట్యాక్స్ నిబంధలను వెనక్కి తీసుకొవాలని బహుజన్ సమాజ్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామన్నారు.అదేవిదంగా ప్రజలు కట్టిన పన్నులతో నిర్మించినటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మాణం పూర్తయి మూడు సంత్సరాలు గడుస్తున్నా, లబ్ధిదారులు ఎంపికలో పారదర్శకత పాటించకుండా, ఇష్టం వచ్చినట్లు కేటాయించడంపై బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, అర్హులైన లబ్దిదారులకు ఎందుకు కేటాయిస్తలేరు దీనికి సమాధానం చెప్పాలని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వీధికుక్కులకు, గంజాయి, తాగుబోతులకు అడ్డాగా మారాయి కొన్ని ఇళ్ళు కిటికీలు పగిలి గోడలు కూలి శిథిలావస్థకు చేరాయి.ఇప్పటికైనా లబ్దిదారులను గుర్తించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నమన్నారు .అదేవిదంగా మీ పాలకవర్గం లోని సభ్యులు మీఫై ప్రతి రోజు అవినీతి ఆరోపణలు చేస్తుంటే మీరు ఎందుకు వివరణ ఇవ్వడంలేదు,మీ మౌనం దేనికి సంకేతం ప్రధమ పౌరుడిగా ఉన్న మీరు ప్రజలకు జవాబు చెప్పాల్సిన ఆవసరం ఎంతైనా ఉంది. కార్పొరేషన్ లో అనేక పార్కు, ప్రభుత్వ, స్మశాన వాటికల స్థలాలు కబ్జా కి గురైన విషయాన్నీ అనేకసార్లు మీ దృష్టికి కమిషనర్ దృష్టికి తీసుకొచ్చాము ఐనా మీరు ఎందుకు స్పందించడం లేదు, చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు,మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకటవ వార్డులోని సర్వే నెంబర్ 29 లో గల సాయి నగర్ కాలనీలోని ఎనమిది వందల గజాల పార్కు స్థలం కబ్జా చేసి నిర్మాణం చేపడుతున్న విషయాన్ని అనేకసార్లు పిర్యాదు చేసినం కానీ ఎలాంటి చర్యలు లేవు.ఇప్పటికైనా కబ్జాకి గురైన పార్కు ప్రభుత్వ స్థలాలు గుర్తించి పెన్సింగ్ ఏర్పాటు చేసి కాపాడలని డిమాండ్ చేస్తున్నాం.బహుజన్ సమాజ్ పార్టీ తరపున లేవనెత్తిన అంశాలు పరిగిణిలోకి తీసుకొని అన్నింటిపై తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం.లేని పక్షంలో ప్రజల తరపున ఉద్యమిస్తామని తెలియజేస్తున్నామన్నారు.






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.