నవతరం

తెలుగు దినపత్రిక

అప్పుల భారం సర్పంచులకు మణిహారం

*మానసిక ఒత్తిడితో కృంగిపోతున్న సర్పంచులు
* ఎమ్మెల్యే ద్వారా సర్పంచ్లకు ప్రభుత్వం నిధులు ఇప్పించలేదా? ఇచ్చినా ఎమ్మెల్యే చేయలేదా?
* నాడు సర్పంచులకు షో కాజ్ నోటీసులు లేవు, ఇప్పుడు ఉన్నాయి
* తెలంగాణ సర్పంచ్లను ప్రభుత్వం అప్పులపాలు చేసింది.
* అంటూ రోదిస్తున్న తెలంగాణ పంచాయతీ సర్పంచులు

అశ్వరావుపేట, నమస్తే ఎల్లంపల్లి: నియోజకవర్గంలో గ్రామపంచాయతీ అభివృద్ధి పనుల్లో భాగంగా, అన్ని పంచాయతీల్లో నిధులు లేవనే విషయం ఆ నోట ఈ నోట రచ్చ కైతే వచ్చేసింది. కొందరైతే సర్పంచుల పట్ల ప్రభుత్వ తీరు షేమ్ షేమ్ అంటూ విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు నిజమే అనుకోవాల్సిన పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వరావుపేట నియోజకవర్గం లో అన్ని పంచాయతీలలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. అదేమంటారా? ఈ నియోజకవర్గానికి ఒక శాసనసభ్యుడు ఎమ్మెల్యేగా పదవి బాధ్యతలు మోస్తూ ఉంటాడు. ప్రభుత్వానికి నియోజకవర్గ ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తాడు. ప్రతి పంచాయతీ ప్రజల అసౌకర్యాలను గుర్తించి వారికి అవసరమైన వసతులను సమకూర్చడంలో, ప్రభుత్వం నిర్ణయించిన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీ వంటి ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే కు సాయంగా పనిచేస్తూ ప్రజా శ్రేయస్సుకు తోడ్పాటును అందిస్తుంది. ప్రజలే ప్రభుత్వం. వారి అవసరాలే ప్రభుత్వ ధ్యేయం. ఈ రీతిన ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థ చాలా కట్టుదిట్టంగా ఆ బాధ్యతలను తన భుజాన వేసుకొని, పయనం కొనసాగిస్తుంది. వారి ప్రయాణానికి అవసరమైన నిధులను ప్రభుత్వం నుండి స్థానిక శాసనసభలో పంచాయతీలకు కొంతమేరకైనా నిధులు సమకూర్చడంలో శాసనసభ సభ్యుడు దోహదపడతాడు. ప్రయాణానికి అయ్యే ఖర్చులు ప్రభుత్వం ఇవ్వకపోతే, అభివృద్ధి మాట ఏమవుతుంది? ప్రజలు కష్టాలు ఇంకెవరికి చెప్పుకోవాలి? ప్రత్యక్షంగా కనిపించే గ్రామ సర్పంచ్ కే కదా,, .అసలు గ్రామాభివృద్ధి అనేది ఎమ్మెల్యే కంటే సర్పంచ్ కె ఎక్కువ బాధ్యత ఉంటుంది. గ్రామాభివృద్ధికి అవసరమైన నిధులను ప్రభుత్వం అసలు మంజూరు చేయడం లేదా? ఒకవేళ చేసినా, పంచాయతీలకు సమకూర్చుటలో జాప్యం చేస్తుందా? ఇప్పుడున్న ఎమ్మెల్యే, ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా, పంచాయతీలకు సమకూర్చుటలో మాత్రం జాప్యం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని కొందరు రాజకీయ విశ్లేషకులు, మేధావులు స్వతంత్ర సర్వే చేసి నిగ్గు తేల్చినట్లు సమాచారం. అయితే ప్రభుత్వం అసలు నిధులను ఎమ్మెల్యే ద్వారా సమకూరుస్తుందా లేదా అనే సందేహాలు కూడా లేకపోలేదు. అసలు ప్రభుత్వం నుండి నిధులు వస్తున్నాయో లేదో కూడా తెలియని పరిస్థితి. అభివృద్ధి మొత్తం గ్రామపంచాయతీల్లో ఉన్న సర్పంచులు చేస్తున్నారనే చెప్పొచ్చు. ఎందుకంటే నిధులు మొత్తం అక్కడికే వస్తున్నాయట.ఇది ప్రజలకు తెలియదు. అయితే ఒకటి మాత్రం నిజం. గ్రామపంచాయతీ యాక్టు 2018ని అనుసరించి, ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా అభివృద్ధి చేసేది మాత్రం సర్పంచ్ లు మాత్రమే నని మరి కొందరు తెలియపరుస్తున్నారు. ఈ కారణం వలన ఎంపీటీసీలకు కూడా నిధులు లేవు, అలాగని కుర్చీ కూడా లేదనే చెప్పవచ్చు. ఎన్నికలలో సర్పంచుల ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లతో, సర్పంచ్ సభలో ఎంపీటీసీలు జీరో అని 2018 పంచాయతీ చట్టం చెబుతోంది. 2018 నుండి ఇప్పటివరకు సర్పంచ్లుగా పనిచేసిన ప్రతి ఒక్క సర్పంచ్ తమ పంచాయితీలో మంచి గుర్తింపుని, మంచి వ్యక్తిత్వాన్ని ,మంచి అభివృద్ధిని, వీటన్నిటితో పాటు బోలెడన్ని అప్పులను మోస్తూనే ఉన్నారట. కానీ 2014లో ఉన్న సర్పంచ్లకు ఇది తెలియదట. ఎందుకంటే 2018 పంచాయతీ చట్టం దీనికి కారణం. అప్పుడు వీధి వీధికి చెత్త ఉంది, ఇప్పుడు లేదు. ఇప్పుడు ట్రాక్టర్ ఉంది అప్పుడు లేదు. అప్పట్లో మొక్కలు బ్రతకడానికి నోచుకోలేదు, ఇప్పుడు 12 అడుగులు మించి ఎదిగాయి. అప్పుడు డంపింగ్ యార్డ్ లేదు, ఇప్పుడు ఉంది. అప్పుడు వీధి వీధికి మురికి నీరు ఉండేది, ఇప్పుడు అంతగా ఆ జాడ కనిపించడం లేదు. స్ట్రీట్ లైట్స్ అప్పుడప్పుడు వెలిగేవి, ఇప్పుడు రాత్రంతా వెలుగుతూనే ఉన్నాయి. అప్పుడు పల్లె ప్రకృతి వనాలు లేవు, నర్సరీలు లేవు, అలాగే గ్రామీణ క్రీడా ప్రాంగణాలు కూడా లేవు. కానీ ఇప్పుడు ఉన్నాయి. అందుకనేమో సర్పంచులకు పని భారం పెరగడమే కాక షోకాసు నోటీసులు కూడా వచ్చేసాయి. అప్పట్లో షోకస్ నోటీసులు అన్నమాట సర్పంచులకు లేదు. అంటే అప్పట్లో సర్పంచ్లకు మానసిక ఒత్తిడి లేదు కానీ ఇప్పుడు ఉంది అని చెప్పొచ్చు. అయితే ఇప్పటికీ ఆంధ్రాలో కన్నా తెలంగాణలోనే పరిశుభ్రత మిన్నగా ఉంటుంది .ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చట్టం గొప్పదే, కానీ గ్రామ పంచాయతీలో సర్పంచ్లను మాత్రం అప్పులు పాలు చేసిందేవరనే రోదనలు రాష్ట్రమంతా వినిపిస్తున్నాయి. ప్రజలకు మాత్రం మంచిని పంచింది. సర్పంచులకు మాత్రం కష్టాలను, అప్పులను మిగిల్చి, మంచి పేరును, మంచి వ్యక్తిత్వాన్ని, తిరుగులేని గెలుపునిచ్చింది. ప్రభుత్వ తీరు మారాలా? ప్రజా ప్రతినిధులు, పాలకులు మారాలా? అనే కోణంలో ఆలోచిస్తే, పార్టీలు, పార్టీ నాయకులు మారాలని, అప్పుడే అశ్వారావుపేట అభివృద్ధి సాధ్యమవుతుందని, పనిలో పనిగా సర్పంచుల పై ఒత్తిడి తగ్గి, అప్పుల భారం అడుగంటుందని కొందరు తెలియజేస్తున్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading