భాగ్యనగర్ జిల్లా భారతీయ జనతా యువమొర్చా ప్రశిక్షణ తరగుతులకు ముఖ్యఅతిథిగా హాజరైన ఈటల రాజేందర్. కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రసంగించారు.
ఈటల రాజేందర్ కామెంట్స్
సమాజంలో సగం మంది అయిన మహిళలను ఎన్నికలయ్యక కెసిఆర్ పట్టించుకోవడం లేదు. వడ్డీలేని రుణాల బాకీలు 2018 నుండి ఇవ్వడం లేదు. 4800 కోట్ల రూపాయలు మహిళలకు బాకీ పడ్డారు.
కెసిఆర్ ఉద్యోగాలు ఇస్తా అని మోసం చేస్తున్నారు. నోటిఫికేషన్లు వేస్తున్నారు తప్ప ఉద్యోగాలు ఇవ్వడం లేదు. పోలీస్ రిక్రూట్మెంట్లో దేశంలో ఎక్కడాలేని నిభందనలు పెట్టీ.. వారి ఆశల మీద నీళ్ళు చల్లుతున్నారు. దీనిమీద పెద్దఎత్తున పోరాడాలి.
గతానికి ఇప్పటికీ వైద్యరంగంలో ఎలాంటి మార్పు లేదు.
ఎక్కడ వేసినగొంగళి అక్కడే ఉంది.
వైద్యం విషయంలో కెసిఆర్ సంపూర్ణంగా విఫలం అయ్యాడు.
హాస్టల్స్ లో నాణ్యమైన బువ్వ పెట్టడం లేదు.
విషాహారం తిని విద్యార్థులు చనిపోతున్నారు.
Bjym దీనిమీద కొట్లాడాలి.
కెసిఆర్ మనుమనికి పెట్టే బువ్వ పెడతా అని చెప్పాడు. పెట్టే వరకు వదిలిపెట్టవద్దు.
కెసిఆర్ ఎవరినీ కలవడు.
ఆపదకి ఆదుకొడు.
ఇనుప కంచల్లో ఉంటున్నాడు.
సచివాలయంకి రాడు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి కెసిఆర్.
ఎన్నికలు అనగానే కెసిఆర్ డబ్బులు కుమ్మరిస్తున్నారు.
హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములు అమ్మి..
అక్రమంగా పర్మిషన్స్ ఇచ్చి లక్షల కోట్ల రూపాయలు దండుకున్నారు.
బిఆరేస్ పెట్టి డబ్బులు పంచి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చెయ్యాలనే
నీచమైన కెసిఆర్ కుట్రలను నిలువరించాలి.
కనుచూపు మేరలో అధికారం ఉంది. బీజేపీను బలోపేతం చేసుకుందాం. ప్రజలు మెచ్చే పాలన తెచ్చుకుందాం అని ఈటల రాజేందర్ అన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.