ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నాం…
రూ.30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామం ఫస్ట్ అవెన్యూ కాలనీలో సుమారు రూ.30 లక్షలతో నూతనంగా నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతి బస్తీ, కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సారధ్యంలో అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదన్నారు. గత ప్రభుత్వాలు చేయని అనేక కార్యక్రమాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి వహించి పూర్తి చేస్తుందన్నారు. ఫస్ట్ అవెన్యూ కాలనీలో వాటర్ లైన్, వర్షపు నీటి కాలువ పనులు వేగంగా పూర్తి చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
ఆదర్శ నియోజకవర్గమే లక్ష్యం





































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































