* కెటిఆర్ కామారెడ్డి రైతులకు కష్టాలు
* అబద్దాలు బిఆర్ఎస్ అధికారిక భాష
* డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ
పెంచికల్ పేట్ / ఆసిఫాబాద్, నమస్తే ఎల్లంపల్లి: భారతదేశంలో ఇప్పటికే ఉన్న యూనివర్సిటీలను పట్టించుకోకుండా, అభివృద్ధి చేయకుండా, మౌలిక సదుపాయాలు కల్పించడం చేతకాక, బిజెపి ప్రభుత్వం నేడు విదేశీ యూనివర్సిటీలకు అనుమతి ఇస్తుందని, పేదలకు ఉన్నత, న్యాయమైన విద్యను దూరం చేయడానికే ఇలాంటి అనుమతులు ఇస్తుందని డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్మించారు. బహుజన రాజ్యాధికార యాత్ర రెండవ విడతలో భాగంగా సిర్పూర్ నియోజకవర్గంలోని పెంచికల్ పేట్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాస్టర్ ప్లాన్ పేరుతో పేదల భూములు గుంజుకొని, కామారెడ్డి రైతుల ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం కెసిఆర్,కెటిఆర్ లే కారణమని ఆరోపించారు. పేదల నుండి వందల ఎకరాలు బలవంతంగా గుంజుకోవడంతో రైతు ఆత్మహత్య చేసుకొని మరణించాడని గుర్తుచేశారు. వెంటనే కామారెడ్డి రైతులకు న్యాయం చేసి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సంగారెడ్డిలో వ్యక్తి చనిపోతే మార్చురీలో పెట్టి పదిహేను రోజుల వరకు బంధువులకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యరంగంలో తెలంగాణ నెం.1 అంటే ఇదేనా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో పత్తి రైతులకు న్యాయం చేయాలని,క్వింటాళ్ పత్తికి 15వేల ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతులకు రైతుబంధు ఇవ్వకుండానే ఇచ్చామని, వందలకోట్లు విడుదల చేశామని ప్రభుత్వ వ్యవసాయ శాఖ మంత్రి అబద్దాలు చెబుతున్నారని, బిఆర్ఎస్ పార్టీ అధికార భాష అబద్దాలేనని ఎద్దేవా చేశారు. జిల్లాల్లో ఎక్కడ కెటిఆర్ మీటింగ్ జరిగినా బిఎస్పి నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు. 2008 డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫిసర్లుగా హోమియోపతి, ఆయుర్వేదం చేసిన అభ్యర్థులకు కూడా అవకాశం ఇవ్వాలన్నారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫిసర్ ఉద్యోగాలకు డి.ఎడ్ చదివిన వారికి అవకాశై కల్పించాలని డిమాండ్ చేశారు. పోలీసు నియామకాల్లో లాంగ్ జంప్ రద్దుచేసి, రన్నింగ్ చేసిన వారికి మొయిన్స్ రాసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
సిర్పూర్ నియోజకవర్గంలో తెలంగాణ వచ్చినా ఆంధ్రా పెత్తనం పోలేదన్నారు. సిర్పూర్ ప్రజలకు ఇంకా ఆంధ్రుల నుండి స్వాతంత్య్రం రాలేదన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో పాఠశాలలు కూడా బాగు చేయలేదని విమర్శించారు. పిల్లలకు యూనిఫాం కూడా ఇవ్వడం లేదన్నారు. కవిత పిల్లలకు ఒక న్యాయం పేద పిల్లలకు ఇంకో న్యాయమా అని ప్రశ్నించారు. మన ఊరు మన బడి పథకం కింద పనుల్లో నాణ్యత లోపించిందని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే భూముల ఆక్రమణ, బియ్యం దందా, గుట్కా దందా చేస్తున్నారని, బహుజన రాజ్యంలో ఆ భూములన్ని పేదలకు పంచుతామన్నారు. దహేగాం, పెంచికల్ పేట్ మధ్య పెద్దవాగుపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు. పెద్దవాగు వల్ల పంట మునిగిన రైతులను ఆదుకోవాల్సిన ఎమ్మెల్యే పట్టించుకోలేదని విమర్శించారు. నియోజకవర్గంలో ఇళ్లు లేని పేదలు వేల సంఖ్యలో ఉన్నారని, ఏ ఊరికి కూడా రోడ్డు వ్యవస్థ సరిగా లేదని మండిపడ్డారు. లిక్కర్ స్కాం కోసం పెట్టుబడి పెట్టిన వందకోట్లలో సగమైనా సిర్పూర్ లో ఖర్చుచేసి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. యాత్ర చెడ్వాయి, కొత్తగూడ పెంచికల్ పేట్, అగర్ గూడ గ్రామాల్లో పర్యటించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సీడం గణపతి, నియోజకవర్గ ఇంచార్జి అర్షద్ హుస్సేన్, నియోజకవర్గ మహిళా నాయకురాలు జ్యోతి, నియోజకవర్గ సెక్రటరీ దుర్గం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.