నవతరం

తెలుగు దినపత్రిక

స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలి

ములకలపల్లి, నమస్తే ఎల్లంపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు దుబ్బ ధనలక్ష్మి, సిఐటియు మండల కన్వీనర్ నిమ్మల మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్ల దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలోని సిఐటియు ఆధ్వర్యంలో ప్రదర్శన తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపి తాసిల్దార్ ఎల్ వీరభద్రం కు డిమాండ్లతో కూడిన మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆశ మధ్యాహ్నం భోజనం, అంగన్వాడీ, ఐకెపి, విఓఏలు, వివిధ 72 స్కీములలో దేశవ్యాప్తంగా స్కీం వర్కర్లు పనిచేస్తున్నారని దేశంలో కోటి మంది పైగా తెలంగాణలో మూడున్నర లక్షల మంది స్కీం వర్కర్లు గత 40 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నారని, వీరికి ఎలాంటి చట్టబద్ధ సౌకర్యాలు కల్పించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ఒకవైపు ఆకాశం అంటున్న నిత్యవసర సరుకులు ధరలు మరోవైపు సాధించాలని వేతనాలతో స్కీం వర్కర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని మోయలేని పని భారంతో కునారిల్లుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కీమ్ వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే ఉపసరించుకోవాలని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్లను ప్రైవేటీకరణ చేయడం వెంటనే ఉపసరించుకోవాలని డిమాండ్ చేశారు. స్కీం వర్కర్లందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. స్కీం వర్కర్ లందరికీ నెలకు 10000 వేల పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాలలో వివిధ రకాల స్కీం వర్కర్ ఒకే విధమైన సర్వీస్ రూల్స్ ఉండాలని అన్నారు. స్కీమ్ వర్కర్లకు బడ్జెట్ పెంచి బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న బోజనం యూనియన్ మండల కార్యదర్శి బుగ్గ వెంకట నరసమ్మ, కీసర జయ, సిఐటియు మండల కమిటీ సభ్యుడు ఓరుగంటి శ్రీను, నల్లి సుజాత,సంఘం అంజమ్మ, అన్నవరపు శైలెజ, ముదిగొండ అనసూర్య,పద్దం తిరుశతమ్మ, వర్షా కన్నయ్య, కోర్రి పద్మ, నాగలక్ష్మి, నాగమణి, అన్నపూర్ణ, వగ్గేల ఆశ్విని, కీసరి సూజత, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading