వరంగల్, నమస్తే ఎల్లంపల్లి: రాజకీయం అంటే సేవ చేయడం, కానీ దానిని కెసిఆర్
డబ్బులు పెట్టు.. గెలువు.. మళ్లీ డబ్బులు సంపాదించు అని మార్చాడు. దీన్ని తిప్పికొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా..
ఆ సత్తా మీకు మాత్రమే ఉంది. ప్రజలే చరిత్ర నిర్మాతలు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఈటల రాజేందర్.. 24 వ డివిజన్లో మాట్లాడారు.. రెండోసారి గెలిచిన తర్వాత మూడు నెలల్లోనే కెసిఆర్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశాడు. పూర్తి మెజారిటీ సాధించిన తర్వాత కూడా మూడు నెలలపాటు మంత్రివర్గంను ఏర్పాటు చేయకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. తెలంగాణ బిడ్డలను అవమానపరిచారు. పార్టీలో నేను చేస్తే వాడు ఒక లీడర్ అవుతాడు లేదు అంటే లేదు అనుకున్నారు. క్యాబినెట్ వేయాలా? లేదా? అనేది నా ఇష్టం అంటూ వ్యవహరించారు. మూర్ఖపు, దుర్మార్గపు పాలనకు తెర లేపారు. ప్రజాస్వామ్యం ఎటు పోతుందని వార్తాపత్రికల్లో రాశారు.. అయినా కూడా ఆయనకు చీమకుట్టినట్టు కూడా లేదు. ఆయన ప్రజాస్వామ్యాన్ని గౌరవించరు. ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చారు కాబట్టి నా ఇష్టం అన్నట్టు వ్యవహరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి ఇంత స్థాయిలో తెరాస ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఎంపీలుగా ఎక్కడ గెలుస్తాం అని డీలపడ్డారు. గెలుస్తామని నమ్మకం కూడా లేకుండే. కానీ నాలుగు నెలల కాలంలో కేసీఆర్ చేసిన పనులు ప్రజల గుండెల్లో గుచ్చుకున్నాయి. ఎమ్మెల్యేగా ఉన్నవారు ఆయనను కట్టడి చేయలేరు.. ఆయనకు ఎదురుగా మాట్లాడలేరు, దీనిని కంట్రోల్ చేసే బాధ్యత మా మీదనే ఉంది అని ప్రజలు భావించి బిజెపిని కాంగ్రెస్ ను గెలిపించారు. నాలుగు ఐదు నెలల కాలంలోనే ఏడు పార్లమెంటు సీట్లను టిఆర్ఎస్ ఓడిపోయింది. 16 సీట్లలో 9 సీట్లు ఓడిపోయినట్లు అయింది. అయినా కూడా కేసీఆర్ సరి చేసుకోలేదు.
ఒక రాజులాగా.. చక్రవర్తిలాగా నా ఇష్టం అన్నట్టు కొనసాగింది. దేశంలో తాగిపించి సంపాదించడంలో నంబర్ ఒన్. ఎంత ఆదాయం వచ్చింది అని ప్రతి రోజు చీఫ్ సెక్రటరీ సమీక్ష చేస్తున్నారు. ప్రతి రెండు వందలమందికి ఒక బెల్ట్ షాప్ పెట్టారు. గుజరాత్ లో మద్యం లేదు. నాలుగు కోట్ల జనాభా ఉన్న రాష్ర్టంలో 45 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అంటే ఎంత తాగిపిస్తున్నరో అర్థం చేసుకోండి. తెలంగాణ సంక్షేమ రాజ్యం అని చెప్తున్నారు.
డబ్బులున్న వారికి రైతుబంధు ఇవ్వడం సంక్షేమమా ?
పేదల సొమ్ము పెద్దలకు ధారాదత్తం చేస్తున్న ఆలోచన లేని సీఎం కెసిఆర్. అధికారం అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకుంటున్న ముఖ్యమంత్రి కెసిఆర్. అటుకులు బుక్కి ఉద్యమం చేసిన వారికి ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయి. ఓటుకు ఐదు వేలు ఇచ్చే స్థాయికి ఎలా చేరారు. దేశంలోనే కాస్లీ ఎన్నికలు తెలంగాణలో జరుగుతున్నాయి.
ఇంత తక్కువ కాలంలో ఇన్ని డబ్బులు ఖర్చుపెట్టే స్థాయి, అన్ని డబ్బులు ఎలా వచ్చాయి అని అడుగుతున్న. కెసిఆర్ ధర్మాన్ని, న్యాయాన్ని చెరబడుతున్నారు. బి.ఆర్.ఎస్ పెట్టి డబ్బులు పంచే దుష్ట సంప్రదాయం దేశమంతా అలవాటు కెసిఆర్ చేయబోతున్నారు. బీఆర్ఎస్ ప్రజలకోసం కాదు. కెసిఆర్ కి రాష్ట్రం సరిపోవడం లేదు. ప్రతిపక్ష నాయకులు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసులు పెడుతున్నారు. కొట్టిస్తున్నారు. చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాం
ఆత్మగౌరవానికి, హక్కులను కెసిఆర్ వెలకడుతున్నారు. రాజకీయం అంటే సేవ చేయడం, కానీ దానిని కెసిఆర్
డబ్బులు పెట్టు.. గెలువు.. మళ్లీ డబ్బులు సంపాదించు అని మార్చాడు. దీన్ని తిప్పికొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.. ఆ సత్తా మీకు మాత్రమే ఉంది. ప్రజలే చరిత్ర నిర్మాతలు. ఎన్టీఆర్, ఇందిరాగాంధీకే దిమ్మ తిరిగే తీర్పు ఇచ్చిన ప్రజాస్వామ్యం మనది. ఇక కెసిఆర్ ఆటలు ఈ గడ్డమీద చెల్లవు. తెలంగాణ ఎందుకో నిశబ్దం అయ్యింది. భూములు లాక్కున్నా, కేసులు పెట్టినా మౌనంగా భరిస్తుంది.
ఇక గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు.
గొప్ప తీర్పు ఇవ్వబోతున్నారు. వరంగల్ ఈస్ట్ లో బిజెపిని గెలిపించేందుకు నావంతు కృషి చేస్తా అని ఈటల రాజేందర్ అన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.