నవతరం

తెలుగు దినపత్రిక

ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కృష్ణారావు

కాజా కుంట చెరువు కబ్జాపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం

కూకట్పల్లి, నమస్తే ఎల్లంపల్లి: కూకట్పల్లిలోని ఖాజా కుంట చెరువు వద్ద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మట్టి పోసి ఫెన్సింగ్ తొలగించి కబ్జాకు పూనుకోవడంపై స్థానికుల ఫిర్యాదు మేరకు వెంటనే ఆ ప్రాంతాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఎట్టి పరిస్థితుల్లో కబ్జా కు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని ఎవరైనా సరే పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అక్కడే ఉన్న ఉప కమిషనర్ రవీందర్, తహశీల్దార్ గోవర్ధన్ లకు కబ్జాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. నియోజకవర్గం లోని అన్ని ప్రాంతాల్లో చెరువులు సుందరీకరించి. ఎస్టిపి ప్లాంట్ల లు నిర్మిస్తుంటే ఈ విధంగా కబ్జాదారులు వారు ఇష్టానికి మట్టి పోస్తుంటే చూస్తూ ఊరుకోమని అన్నారు. అలాగే పూడ్చిన మట్టిని తొలగించి వెంటనే ఫెన్సింగ్ ఎర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ 8 ఎకరాల 17 కుంటల చెరువును అభివృద్ధి పరిచేందుకు జిహెచ్ఎంసి కి స్వాధీన పరిచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, ఇంజనీరింగ్ అధికారి గోవర్ధన్, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గోన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading