నవతరం

తెలుగు దినపత్రిక

పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి పీజేఆర్

* గొట్టిముక్కల వెంగళరావు

కూకట్ పల్లి, నమస్తే ఎల్లంపల్లి: బడుగు,బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం సేవలు అందించిన పేదల పెన్నిది పీజేఆర్‌ అని కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళరావు అన్నారు. గురువారం మాజీ సీఎల్పీ నేత, మాజీ మంత్రి పీజేఆర్ జయంతి సందర్భంగా బాలానగర్ డివిజన్ లో పులి శ్రీకాంత్ పటేల్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో వెంగళరావు ముఖ్య అతిధిగా హాజరై పిజెఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు నిత్యం అందు బాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన మహానీయుడు పీజేఆర్ అని, ఆయ‌న‌ పేద ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కే. రాజు ముదిరాజ్, ఏ బ్లాక్ వర్కింగ్ ప్రెసిడెంట్ సూరజ్ తివారి,రాజమల్లయ్య, ఏ బ్లాక్ ఉపాధ్యక్షుడు యుగంధర్ రెడ్డి, టీపీసీసీ జాయింట్ సెక్రటరీ బండారి నవీన్ గౌడ్,ఎరుపుల మహేందర్,ముకేందర్,కూకట్పల్లి డివిజన్ అధ్యక్షుడు మేకల రమేష్,బాలానగర్ డివిజన్ ఉపాధ్యక్షుడు ఆకుల నరేందర్,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading