నవతరం

తెలుగు దినపత్రిక

సీఎం కె.సీ.ఆర్ పాల్వంచ పర్యటనను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు

* డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల

పాల్వంచ, నమస్తే ఎల్లంపల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాల్వంచ పట్టణంలో జరిపిన పర్యటనలో సీఎంకు ఘన స్వాగతం పలికి, విజయవంతం చేసిన అన్ని వర్గాల ప్రజలకు డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం పాల్వంచలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ ప్రారంభానికి విచ్చేసిన కెసిఆర్ కు కొత్తగూడెం ఎంఎల్ఏ వనమా వెంకటేశ్వరరావు నాయకత్వంలో ప్రజా ప్రతినిధులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు వేలాదిగా స్వాగతం పలికారన్నారు. వనమా నేతృత్వంలో కొత్తగూడెం నియోజకవర్గానికి సీఎం ఆర్థిక నిధులు మంజూరు చేసి, వనమాపై అభినందన ల వర్షం కురిపించినందుకు కొత్వాల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస పట్టణ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఎస్వీఆర్కే ఆచార్యులు, జడ్పీటీసీ సభ్యులు బరపటి వాసుదేవరావు, ఎంపీపీ మడివి సరస్వతి, వైస్ ఎంపీపీ మార్గం గురవయ్య, పెద్దమ్మ తల్లి గుడి మాజీ చైర్మన్ మహిపతి రామలింగం, సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, తెరాస మండల అధ్యక్షులు మల్లెల శ్రీరామ్మూర్తి, పూసల విశ్వనాథం,పెద్దమ్మగుడి మాజీ సభ్యులు బేతంశెట్టి విజయ్, చింత నాగరాజు, నవభారత్ ఆనంద్ లు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading