నవతరం

తెలుగు దినపత్రిక

బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలు

చిల్కనగర్ లో జోరుగా అక్రమ నిర్మాణాలు

ఉప్పల్ / చిలుకనగర్, నమస్తే ఎల్లంపల్లి: ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో చిల్కనగర్ డివిజన్ లో జోరుగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. వివరాలోకి వెళ్తే ఉప్పల్ నియోజకవర్గం చిలుకానగర్ డివిజన్ హెచ్ఎంటి చెరువు అనుకోని ఉన్న స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిసి మాజీ ఎమ్మెల్యే ఏన్వీఎస్ఎస్ ప్రభాకర్ స్థానిక కాలనీ వాసులు, బిజెపి నాయకులతో కలిసి పరీశీలించారు. బఫర్ జోన్ లో భవన నిర్మాణ అనుమతులు ఏలా ఇస్తారని, ఎఫ్టిఎల్ లో 30 మీటర్ల వరకు అనుమతి లేదని అధికారులకు తెలియదా, టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలా అక్రమ కబ్జా నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, వెంటనే అక్రమ కబ్జా నిర్మాణం తొలగించాలని ఉన్నతాధికారులతో మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలోని ప్రభుత్వ స్థలాలను కబ్జా కాకుండా చూడాలని, ప్రభుత్వ స్థలాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో చిలుకానగర్ డివిజన్ అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్, నాచారం డివిజన్ అధ్యక్షులు మల్కా ప్రకాశ్, అసెంబ్లీ కన్వీనర్ దేవసాని బాలచందర్, మహిళా మోర్చా అసెంబ్లీ కన్వీనర్ అనితపద్మ రెడ్డి, సీనియర్ నాయకులు గోనె అంజయ్య ముదిరాజ్, కంచర్ల భరత్ రెడ్డి, మెహన్ రెడ్డి, చంద్రమౌళి, మంజుల వాణి, జ్యోతి రెడ్డి, రవికాంత్, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading