హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: నాపై ఎంతో నమ్మకంతో తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాకు అవకాశం ఇవ్వడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, నూతన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శాంతి కుమారి అన్నారు. సి.ఎస్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బీఆర్ కేఆర్ భవన్ లో తనను కలసిన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తనపై ఉంచిన ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి నా శాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ కార్యక్రమాలతోపాటు అన్ని అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలులో సహచర అధికారులతో సమన్వయంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో విజయవంతంగా అమలు చేయనున్నట్టు స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.